Breaking News

హలీమ్‌ @ రూ.వెయ్యి కోట్లు!

Published on Thu, 04/03/2025 - 05:05

సాక్షి, సిటీబ్యూరో: రంజాన్‌ వచ్చిoదంటే హైదరాబాదీలకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీమే. ఈ మాసంలో ప్రత్యేకంగా లభించే హలీమ్‌ కోసం మాంసప్రియులు తహతహలాడతారు. ఈసారి రికార్డు స్థాయిలో జరిగిన హలీమ్‌ అమ్మకాలే దానికి నిదర్శనం. ఏకంగా రూ.వేయి కోట్ల మేర హలీమ్‌ వ్యాపారం జరిగిందని అంచనా. దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో హలీమ్‌ విక్రయాలు సాగాయని వ్యాపారులు చెబుతున్నారు. పోషకాలతో కూడిన రుచికరమైన హలీమ్‌ కేంద్రాలు, హోటళ్లు రంజాన్‌ నెలంతా కిటకిటలాడాయి. 

ప్రతి హోటల్‌ ముందు ప్రత్యేక బట్టీలు, కౌంటర్ల ద్వారా విక్రయాలు సాగాయి. ఈ సీజన్‌లో దాదాపు 50 లక్షల ప్లేట్ల హలీమ్‌ అమ్మకాలు జరిగినట్లు హైదరాబాద్‌ హోటళ్ల సంఘం చెబుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 20 శాతం అధికంగా హలీమ్‌ అమ్మకాలు సాగాయని అంటోంది. కేవలం హోటళ్లలోనే కాదు ఫుడ్‌ డెలివరీ యాప్‌లలోనూ హలీమ్‌కే ఆహారప్రియులు ఓటేశారు. టేక్‌ ఆవేలు, స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్‌ డెలివరీ యాప్‌లతో హలీం అమ్మకాలు ఒక రేంజ్‌లో సాగాయి.  

ఆరువేల విక్రయ కేంద్రాలు.. 
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 6 వేల చిన్నా, చితక హలీమ్‌ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన రెస్టారెంట్లు వీటికి అదనం. చిన్న, మధ్య తరగతి రెస్టారెంట్లే కాదు స్టార్‌ హోటళ్లలోనూ రంజాన్‌ సీజన్‌ మెనూలో హలీం డిష్‌ను తప్పనిసరి చేశారు. హైదరాబాదీ బిర్యానీని హలీం ఓవర్‌ టేక్‌ చేసి మెనూలో టాప్‌లో నిలిచింది. చిన్న హలీం కేంద్రాల్లో రోజుకు దాదాపు వంద పేట్ల చొప్పున అమ్మకాలు జరిగితే, పేరున్న హోటళ్లు, కేంద్రాల్లో సుమారు 500–600 ప్లేట్ల హలీం విక్రయించారని అంచనా. 

వీకెండ్‌లలో 25 శాతం అధికం..
హలీమ్‌ ప్లేట్‌ ధర రూ.100 నుంచి 320 వరకు పలికింది. ఎక్కువ శాతం మటన్‌ హలీమ్‌ సెంటర్లు ఉండగా, పలు ప్రాంతాల్లో చికెన్, బీఫ్‌ కేంద్రాలు కూడా వెలిశాయి. వీటిలో అత్యధికంగా 70 శాతం మేర పాతబస్తీలోనే ఉన్నాయి. సగటున రోజుకు దాదాపు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. సాధారణ రోజుల కంటే వీకెండ్‌లలో 25 శాతం అధికంగా విక్రయాలు జరిగాయని జహంగీర్‌ అనే హలీం కేంద్ర నిర్వాహకుడు తెలిపారు. పాతబస్తీతో పోలిస్తే సైబరాబాద్‌లో హలీం జోష్‌ ఎక్కువగా ఉందని, పేరొందిన ఫుడ్‌ బ్లాగర్స్‌ కూడా హలీంను ప్రమోట్‌ చేసేలా వార్తలు ఇవ్వడం అమ్మకాలకు కలిసొచ్చిందని షెరటన్‌ హోటల్‌ మేనేజర్‌ నాసర్‌ చెప్పారు.  

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)