Breaking News

టైప్-1 మ‌ధుమేహంపై పిల్ల‌ల‌కు అవ‌గాహ‌న‌

Published on Sat, 11/15/2025 - 09:36

హైద‌రాబాద్, సాక్షి: అంత‌ర్జాతీయ మ‌ధుమేహ దినోత్స‌వం, బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా జీవీకే హెల్త్ హ‌బ్‌లో వినూత్న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. చిన్న‌త‌నం నుంచి టైప్-1 మ‌ధుమేహం ఉండి, దాన్ని విజ‌య‌వంతంగా అధిగ‌మిస్తూ ఇప్పుడు పెళ్లిళ్లు కూడా అయిన కొంత‌మంది.. ఇప్పుడిప్పుడే దాని గురించి తెలిసి ఇబ్బంది ప‌డుతున్న పిల్ల‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. నాలుగైదేళ్ల వ‌య‌సులో టైప్-1 మ‌ధుమేహం ఉండి, ఏం తినాలో ఏం తిన‌కూడ‌దో కూడా స‌రిగా తెలియ‌ని పిల్ల‌ల‌కు.. తాము ఇన్నాళ్ల నుంచి ఎలా దాన్ని అధిగ‌మిస్తున్నామ‌న్న విష‌యాన్ని స‌మ‌గ్రంగా వివ‌రించారు.

అంత‌కుముందు ఉద‌యం 6.30 గంట‌ల‌కు కేబీఆర్ పార్కు నుంచి మొద‌లుపెట్టి 8.30కి జీవీకే హెల్త్ హ‌బ్ వ‌ర‌కు డ‌యాబెటిస్ వాక్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జీవీకే డ‌యాబెటిస్ సెంట‌ర్ మెడిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎన్‌.జి. శాస్త్రి మాట్లాడుతూ, ‘‘మ‌ధుమేహం వ‌ల్ల ర‌క్త‌నాళాలు ప్ర‌భావితం అవుతున్నాయి. దానివ‌ల్ల చిన్న‌వ‌య‌సులోనే గుండె స‌మ‌స్య‌లు, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. మ‌న దేశం మ‌ధుమేహం విష‌యంలో ప్ర‌పంచ రాజ‌ధానిగా ఉంది. అందువ‌ల్ల అంద‌రికీ ప్ర‌జ‌ల్లో దీనిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకే డ‌యాబెటిస్ వాక్ నిర్వ‌హించాం’’ అని తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా టైప్-1 మ‌ధుమేహానికి ఉచిత చికిత్స అందించ‌డంతో పాటు ఉచితంగా వైద్య ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో క‌న్స‌ల్టెంట్ జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్ డాక్ట‌ర్ శివ, క‌న్స‌ల్టెంట్ డ‌యాబెటాల‌జిస్ట్ డాక్ట‌ర్ దీపిక‌, ఇంకా పెద్ద సంఖ్య‌లో వైద్యులు, ఆస్ప‌త్రి సీఓఓ జె.సుమ‌న్ రాజు, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)