Breaking News

డిగ్రీ లేకున్నా స్కిల్స్‌ ఉంటే ఓకే

Published on Wed, 04/09/2025 - 04:54

సాక్షి, హైదరాబాద్‌: ‘ఏ డిగ్రీ చదివారో అవసరం లేదు.. ఏ కాలేజీనో అవసరం లేదు.. రెజ్యూమ్‌ ముఖ్యం కాదు.. స్కిల్స్‌ ఉంటే మంచి ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తాం’అంటూ ఇటీవల ‘స్మాలెస్ట్‌.ఏఐ’ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ స్టార్టప్‌ వ్యవస్థాపకుడు సుదర్శన్‌ కామత్‌ ఎక్స్‌ వేదికగా పెట్టిన పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటనకు కొనసాగింపుగా... తమ కంపెనీ ఫుల్‌స్టాక్‌ ఇంజనీర్‌ను అన్వేషిస్తోందని, తాము కోరుకున్న నైపుణ్యాలున్న వారు దొరికితే ఏడాదికి రూ.40 లక్షల ప్యాకేజీ ఇచ్చేందుకూ సిద్ధమని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

బెంగళూరుకు చెందిన ఈ సంస్థ ఇచ్చిన ప్రకటనకు ఏడువేలకు పైగా దరఖాస్తులు వచ్చాయంటే అది ఏ స్థాయిలో ఆకట్టుకుందో స్పష్టమవుతోంది. ఈ కంపెనీలో 14 మంది టీమ్‌ పనిచేస్తుండగా, వారిలో డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ బృందంలో పనిచేస్తున్న నలుగురు అసలు కాలేజీకి వెళ్లకపోవడమో లేదా మధ్యలో మానేసినవారో కావడం గమనార్హం. వారు ఈ సంస్థలోని ఐఐటీ, వీఐటీ, ఐఐఐటీల్లో పట్టాలు పొందినవారితో తమ తమ రంగాల్లో పోటీపడుతుండటం విశేషం. 

ఈ స్టార్టప్‌ స్థాపకులు కామత్, అక్షత్‌ మాండ్లోయి ఐఐటీ–గువాహటి పట్టభద్రులైనప్పటికీ, డిగ్రీలు కాదు ఆయా రంగాల్లో నైపుణ్యాలు, సాధించాలనుకున్న లక్ష్యాలు ముఖ్యమని.. తాము కోరుకున్న రంగాల్లో నైపుణ్యాలు సమృద్ధిగా ఉంటే వారిని మంచి ప్యాకేజీలతో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు.

అదే బాటలో పలు కంపెనీలు
ఈ సంస్థే కాకుండా భారత్‌లోని వివిధ కంపెనీలు డిగ్రీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఆయా విషయాల్లో, రంగాల్లో నైపుణ్యాలకు పెద్దపీట వేస్తూ ‘స్కిల్స్‌–ఫస్ట్‌’అంటూ ముందుకు సాగుతున్నాయి. దీంతో దేశంలో స్కిల్స్‌ బేస్డ్‌ హైరింగ్‌ ట్రెండ్‌ ఊపందుకుంటున్నట్టు కనిపిస్తోంది. కాలేజీలు, యూనివర్సిటీల్లో చదివే మొక్కుబడి చదువుల కన్నా తమ అభిరుచులకు తగ్గట్టుగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఆయా రంగాల్లో మంచి ఉద్యోగాలు పొందొచ్చనే సందేశం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. 

టెక్‌ దిగ్గజం ఐబీఎం కూడా ఈ హైరింగ్‌ ట్రెండ్‌కే మొగ్గు చూపుతోంది. ఐబీఎం ఇండియా... ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వచ్చే వారి టాలెంట్‌ను డిగ్రీ సర్టిఫికెట్ల ద్వారా అంచనా వేయకుండా.. ఆయా రంగాల్లో వారి నైపుణ్యాలను బట్టి విధులకు సరిపోతారా లేదా అని అంచనా వేస్తోంది. ‘ప్రోగ్రామింగ్, జనరేటివ్‌ ఏఐ అనే వాటి విస్తరణతో మరీ లోతైన కోడింగ్‌ నైపుణ్యాలు తప్పనిసరి కాకపోవడంతో ‘నో కోడ్‌’లేదా ‘లో కోడ్‌’ప్రోగ్రామ్‌లకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో ఉద్యోగార్థి డిగ్రీలు, సర్టిఫికెట్ల కంటే నైపుణ్యాలు, యోగ్యత, అభిరుచులు అనే వాటికి ప్రాధాన్యత పెరిగింది’అని ఐబీఎం హెచ్‌ఆర్‌ మేనేజర్లు చెబుతున్నారు. 

ఐబీఎం ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న హ్యాకథాన్‌లలో సంప్రదాయ రెజ్యూమ్‌ల కంటే ఏదైనా సమస్య–పరిష్కారంపై చూపే చొరవ, నైపుణ్యాలకు పెద్దపీట వేస్తోంది. అదేవిధంగా, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌), కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ జెట్‌వర్క్‌ కూడా స్కిల్క్‌ ఫస్ట్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇదిలాఉంటే, డిగ్రీ లేకపోతే నైపుణ్యాలను అంచనా వేయడానికి స్పష్టమైన విధానం లేదన్న ధోరణితో పలు కంపెనీలు ఇప్పటికీ సంప్రదాయ పద్ధతినే అవలంబిస్తున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)