Breaking News

అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత..

Published on Sun, 10/20/2024 - 12:18

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని అశోక్‌ నగర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రూప్‌-1 అభ్యర్థులు ఆదివారం ఉదయం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అభ్యర్థులు మీడియా సమావేశం పెట్టే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.

వివరాల ప్రకారం.. గ్రూప్‌-1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో అశోక్‌నగర్‌లో రోడ్లపైకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు మాట్లాడుతూ.. మా జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. మా బాధలు వినండి సీఎం రేవంత్ రెడ్డి. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. కొద్దిగా కనికరించండి. జీవో నంబర్ 29ని రద్దు చేయండి.

ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లు వేరు వేరుగా ఉన్నాయి. ఇలా చరిత్రలో నంబర్లు వేరే వేరేగా ఎప్పుడూ రాలేదు. ఎగ్జామ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఒక్కరే రాసినప్పుడు వేరే వేరే హాల్ టికెట్ నంబర్లు ఎలా వస్తాయి. ఇదే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మమ్మల్ని పిలిచి మాట్లాడాలని సీఎం రేవంత్‌ రెడ్డి గారిని వేడుకుంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు.. గ్రూప్‌-1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అశోక్‌ నగర్‌లో భారీ సంఖ్యలో బందోబస్తే ఏర్పాటు చేశారు. అలాగే, గాంధీ భవన్‌ వద్ద ముందస్తుగా భద్రతను పెంచారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)