గ్రూప్‌–1 ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల

Published on Thu, 04/10/2025 - 05:54

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు అభ్య ర్థులను ఎంపిక చేస్తూ... జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఒక్కో ఉద్యోగానికి ఒక అభ్యర్థినే ఎంపిక చేసింది. 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక చేపట్టడంతో ప్రస్తుతం ఏ కేటగిరీలోనూ అభ్యర్థులు షార్ట్‌ఫాల్‌ లేదని కమిషన్‌ వర్గాలు తెలిపాయి. 

ప్రస్తుతం ప్రాథమిక జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఈ నెల 16వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16, 17, 19, 21 తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పబ్లిక్‌ గార్డెన్‌లోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ క్యాంపస్‌లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. 

గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లోపి అనెక్జర్‌–6లో నిర్దేశించిన విధంగా అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, స్వీయ ధ్రువీకరణతో రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.

గైర్హాజరైతే ఉద్యోగం పోయినట్లే...
ధ్రువపత్రాల పరిశీలనకు నిర్దేశించిన తేదీల్లో అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కావాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. నిర్దేశించిన తేదీల్లో హాజరు కాకపోయినా, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురాకపోయినా తదుపరి అవకాశం ఉండదని వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థుల సంఖ్య తగ్గితే తదుపరి మెరిట్‌ అభ్యర్థులకు సమాచారం ఇచ్చి ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించనున్నట్లు వివరించింది.  

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)