Breaking News

కోల్‌ కారిడార్‌కు లైన్‌క్లియర్‌!

Published on Sat, 01/25/2025 - 02:21

సాక్షి, హైదరాబాద్‌: ఇన్నాళ్లూ ప్రతిపాదనలకే  పరిమితమైన కోల్‌ కారిడార్‌ ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ఇటీవల అందిన డీపీఆర్‌ను పరిశీలించిన రైల్వే బోర్డు, దీనిని సాధ్యమయ్యే ప్రాజెక్టుగా తేల్చటంతో తుది ఆమోదం లభించే కేంద్ర కేబినెట్‌ ఆర్థిక వ్యవహారాల కమిటీ(సీసీఈఏ)కి చేరింది. ఇక్కడ ఆమోదం లభిస్తే.. కేంద్ర బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయించే అవకాశం ఉంది. 207.80 కి.మీ. నిడివితో ఉండే ఈ కారిడార్‌ నిర్మాణానికి రూ.3997 కోట్లు ఖర్చవుతుందని డీపీఆర్‌లో పొందుపరిచారు. 1999లో తొలుత ఈ లైన్‌కు ప్రతిపాదించగా, తిరిగి 2013లో మరోసారి రూ.1112 కోట్ల నిర్మాణ అంచనాతో ప్రతిపాదనను పునరుద్ధరించారు. చివరకు గతేడాది అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

రైళ్ల ట్రాఫిక్‌ సాంద్రత 140 శాతంగా ఉండటంతో.... 
ప్రస్తుతం రామగుండం నుంచి మణుగూరుకు వరంగల్‌–మహబూబాబాద్‌–డోర్నకల్‌–కారేపల్లి–పాండురంగాపురం మీదుగా రైల్వేలైన్‌ ఉంది. ఈ మార్గంలో మణుగూరు వెళ్లాలంటే 287 కి.మీ. ప్రయాణించాలి. ఈ మార్గంలో డోర్నకల్‌ జంక్షన్‌ వరకు విజయవాడ, విశాఖపట్నం మార్గం కావటంతో ప్రయాణికుల రైళ్లు అధికంగా తిరుగుతాయి. రామగుండం నుంచి బొగ్గులోడుతో గూడ్సు రైళ్లు అధికంగా తిరుగుతాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల ట్రాఫిక్‌ సాంద్రత 140 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో రామగుండం–మణుగూరు మధ్య నేరుగా ప్రత్యామ్నాయ రైలు మార్గం అవసరమని నిర్ణయించారు. కొత్త మార్గంలో ప్రయాణిస్తే 80 కి.మీ. నిడివి తగ్గుతుంది. దీంతో సమయంతోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. అన్నింటికి మించి రైలు ట్రాఫిక్‌ రద్దీ బాగా తగ్గి ఇటు ప్రయాణికుల రైళ్లు, అటు సరుకు రవాణా రైళ్లు వేగంగా గమ్యం చేరతాయి.  

కోల్‌మైన్‌ టూ పవర్‌ప్లాంట్స్‌.. 
రామగుండం నుంచి పెద్ద ఎత్తున బొగ్గు వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా అవుతుంది. ప్రస్తుతం సరైన రైలు మార్గం లేక రోడ్డు ద్వారా తరలిస్తున్నారు. రోడ్లు పాడవటంతోపాటు ఖర్చు కూడా అధికంగా ఉంటోంది. రైల్వేలైన్‌ అందుబాటులో ఉంటే..మణుగూరులో ఉన్న భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు బొగ్గు తరలింపు సులభవుతుంది. దీంతోపాటు కాకతీయ, పాల్వంచ పవర్‌ప్లాంట్లకు దగ్గరి దారి అవుతుంది. ఇక కొత్తగూడెం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరికి కొత్తలైన్‌ నిర్మిస్తోంది. అక్కడి పారిశ్రామిక వాడతో ఈ కొత్త మార్గం అనుసంధానం కానుంది. వెరసి పారిశ్రామిక పురోగతికి కూడా ఇది దోహదం చేయనుంది.  

పర్యాటక ప్రాంతాల అనుసంధానం.. 
పర్యాటకులు అధికంగా వచ్చే ప్రాంతాలతో కొత్త మార్గం నిర్మించనున్నారు. కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోట గుళ్లు, లక్నవరం, బొగత జలపాతం ప్రాంతాల మీదుగా సాగుతుంది. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు ఇది ఎంతో వీలుగా ఉంటుంది. పర్యాటకంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ అటవీ ప్రాంతాలు కావటంతో సరైన రవాణా వ్యవస్థ లేదు. లక్షల మంది వచ్చే మేడారం జాతర సందర్భంలో భక్తులు ఆ ప్రాంతానికి చేరేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైలుమార్గం అందుబాటులోకి వస్తే, ప్రత్యేక రైళ్లు నడపటం ద్వారా లక్షల మందిని సులభంగా తరలించే వీలు కలుగుతుంది.  

గిరిజిన ప్రాంత ప్రయాణికులకు..  
గిరిజన ప్రాంతాలకు సరైన రైలు మార్గం లేదన్న వెలితి కూడా దీనితో తీరుతుంది. రాఘవాపురం, మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి లాంటి ప్రాంతాలవాసులకు ఈ రైలు మార్గం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కొత్త మార్గంలో దాదాపు 13 వరకు స్టేషన్లు ఉండే అవకాశముంది. ఉత్తర భారత్‌ వైపు వెళ్లే రైళ్లను ఎక్కువగా నడిపేందుకు ఇది ప్రత్యామ్నాయ లింకు మార్గంగా ఉపయోగపడుతుంది. ఢిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాల ప్రయాణ సమయాన్ని ఇది తగ్గిస్తుంది.  

రైటప్‌: కొత్తగా నిర్మించే రైల్వే లైన్‌ మార్గం ఇలా.. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)