జీహెచ్‌ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం

Published on Thu, 04/18/2024 - 21:25

సాక్షి, హైదరాబాద్‌: వేసవి కాలం రావడంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండటంతో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీ, మోటర్ల వినయోగంతో విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువవుతోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో  వినియోగం జరిగింది.  

గురువారం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధిగమించిది. 2023 ఏప్రిల్ 18న గరిష్ఠ డిమాండ్ 3,471 మెగావాట్లు కాగా గతేడాదితో పోల్చితే ప్రస్తుతం 582 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. అయితే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినప్పటికీ అధికారులు ఏలాంటి అంత‌రాయం లేకుండా నిరంత‌రం స‌ర‌ఫ‌రా చేశారు.

వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తున్న విద్యుత్ శాఖ, సిబ్బందిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. మే నెలలో విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్‌ సిబ్బంది, అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే సేవలందించి వినియోగదారుల మన్ననలు పొందాలని సూచించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)