Breaking News

ఉదయం పరేడ్‌ గ్రౌండ్స్‌లో.. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై..

Published on Fri, 05/31/2024 - 05:41

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను జూన్‌ 2న అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. జూన్‌ 2న జరిగే కార్యక్రమాల షెడ్యూల్‌ ఇదీ..

అమరవీరులకు నివాళులతో మొదలు
జూన్‌ 2న ఉదయం 9.30కు అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత సీఎం జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్‌ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటాయి.

తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరి స్తారు. అనంతరం ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. విశిష్ట సేవలు అందించిన పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్‌ అనంతరం ఉదయం కార్యక్రమం ముగుస్తుంది.

సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వేడుకగా..
2న సాయంత్రం ట్యాంక్‌బండ్‌ మీద వేడుకలు నిర్వహిస్తారు. తెలంగాణకు సంబంధించిన హస్తక ళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్‌ స్టాల్స్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు సీఎం రేవంత్‌ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. తర్వాత తెలంగాణ కళారూ పాలకు అద్దం పట్టేలా కార్నివాల్‌ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.

అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్‌బండ్‌ఒక చివర నుంచి మరో చివరి వరకు 5 వేల మంది భారీ ఫ్లాగ్‌వాక్‌ నిర్వహి స్తారు. ఈ ఫ్లాగ్‌వాక్‌ జరుగుతున్న సమయంలో ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గేయం ఫుల్‌వెర్షన్‌ (13.30 నిమిషాల)ను విడుదల చేస్తారు. గీత రచయిత, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలను సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్‌ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా సాగే బాణసంచా కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.

యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న ఏర్పాట్లు
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రధాన వేదికతోపాటు, ముఖ్య అతిథులు, ఆహ్వానితులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా లాంజ్‌లు సిద్ధం చేస్తున్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో భారీ టెంట్లను, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణసంచా, లేజర్‌ షో, ఫుడ్, గేమింగ్‌ స్టాళ్ల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపు 80 స్టాళ్లను సిద్ధం చేస్తున్నారు. వీటిలో హస్తకళలు, మహిళా బృందాలు తయారు చేసిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ హోటళ్ల స్టాల్స్, చిన్న పిల్లలకు గేమింగ్‌ షోలు ఉన్నాయి. కార్నివాల్‌లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళాబృందాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)