Breaking News

TG: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు

Published on Thu, 06/20/2024 - 16:59

సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో అనేక నేరాలు, సామాజిక రుగ్మతలకు మానసిక ఒత్తిడి కారణం అనే విషయం మనకు తెలుసు. ఖైదీలకు యోగ శిక్షణ ఇవ్వటం ద్వారా వారిలో సత్ప్రవర్తనను మెరుగుపరవచ్చని అనేక సందర్భాలలో రుజువైంది. అదే సమయంలో నేరాలను అరికట్టే క్రమంలో పోలీసు సిబ్బందికి సైతం మానసిక ఒత్తిడి సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. వీటిని అధిగమించేందుకు కూడా యోగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణా పోలీసు ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందికి యోగా శిక్షణను ప్రోత్సహిస్తూ వస్తున్నారు.

ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగతున్న సందర్భంగా తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్ళు, కార్యాలయాలో ఖైదీలకు, సిబ్బందికి విడివిడిగా యోగశిక్షణను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు నాందిగా ప్రముఖ యోగా, ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సహకారంతో తెలంగాణ పోలీస్ అకాడమీలో 1200 మంది పోలీసు సబ్-ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు ఒక గంట పాటు యోగసాధనకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, మానవతావాది పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ స్వరంతో కూడిన ధ్యానంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణా పోలీసు అకాడెమీ డైరెక్టర్ జనరల్ అభిలాషా బిస్త్ మాట్లాడుతూ, కేవలం ఒక యోగా మ్యాట్ లేదా దుప్పటి, కొద్దిపాటి ఖాళీ స్థలం ఉంటే చాలు యోగ సాధన చేయవచ్చని, ఖరీదైన ఉపకరణాలేవీ లేకుండా ఆరోగ్యాన్ని పొందగలిగే ప్రక్రియ యోగ అని అన్నారు. “ఈ రోజుల్లో పని, హోదాలతో సంబంధం లేకుండా, పోలీసు సిబ్బంది సహా అందరికీ ఏదో ఒక రూపంలో మానసిక ఒత్తిడి ఉంటోంది.  మన మనసులో కలిగే ఆలోచనలకు మనం బాధ్యత తీసుకున్నపుడు, రోజూ కొంచెం సేపు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేసినపుడు మన మనసును, ఒత్తిడిని మనం అదుపు చేయగలుగుతాం. ఈ దిశలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అత్యంత ప్రశంసనీయం.” అని ఆమె పేర్కొన్నారు. శ్రీమతి అభిలాషా బిస్త్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగ సాధన చేయటం ద్వారా సిబ్బందిలో ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపారు.

“మానవాళి అంతరంగ వికాసానికి తోడ్పడేందుకు భారతదేశం అందించిన ఈ ప్రాచీన కళను, ప్రపంచవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది.” అని శ్రీశ్రీ రరవిశంకర్ అభిలషించారు. “గత కొద్ది సంవత్సరాలుగా యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం లభిస్తోంది. యోగాలో ఆసనాలు అనేవి ఆరంభ సూచిక మాత్రమే. యోగాలోని విజ్ఞానం చాలా లోతైనది. మనసును సమత్వంగా, భిన్న పరిస్థితులలో తొణకకుండా స్థిరంగా ఉంచటానికి, చేసే పనిపై ధ్యాసను, ఏకాగ్రతను పెంపొందించడానికి యోగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఏమిటి? అనే ప్రశ్న విజ్ఞానశాస్త్రానికి మూలమైతే, నేను ఎవరు? అనే ప్రశ్న ఆధ్యాత్మికతకు మూలం.” అని గురుదేవ్ తన సందేశంలో పేర్కొన్నారు. 

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా ప్రదేశాలలో 55వేల మందికి పైగా యోగ సాధకులు, ఔత్సాహికులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణాలోని 30 జిల్లాలలో 65కు పైగా సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి. తెలంగాణా పోలీస్ అకాడెమీ, వివిధ పోలీసు బెటాలియన్లు, శిక్షణా కేంద్రాలు, సి.ఆర్.పి.ఎఫ్ దళాలు, రైల్వే కార్యాలయాలు, ఉద్యోగులు ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)