Breaking News

జీహెచ్‌ఎంసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Published on Thu, 12/25/2025 - 22:17

సాక్షి,హైదరాబాద్: జీహెచ్‌ఎంసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్‌ (ORR) వరకు విస్తరించడంతో పాటు, జోన్లు సర్కిల్స్ సంఖ్యను పెంచుతూ అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు పెంచుతూ, 30 సర్కిల్స్‌ను 60కు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఉన్నాయి. ఈ కొత్త జోన్లలో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే, వార్డు ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. త్వరలోనే ఈ కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల ద్వారా పరిపాలన కొనసాగనుంది.

జీహెచ్‌ఎంసీ వార్డుల డీ లిమిటేషన్‌పై కూడా ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 వార్డులు ఖరారు చేశారు. ఈ నెల 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు, పదిరోజుల పాటు ప్రజల అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సమయంలో 6 వేలకు పైగా అభ్యంతరాలు అందాయి. వాటిలో సహేతుకమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఈరోజు ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నిర్ణయంతో GHMC పరిధిలో పరిపాలన మరింత విస్తృతమవుతుంది. ప్రజలకు సమీపంలోనే జోనల్, సర్కిల్ కార్యాలయాలు ఉండటం వల్ల స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)