Breaking News

సేత్వార్‌ సమస్యలకు ‘చెక్‌’

Published on Fri, 08/25/2023 - 01:48

సాక్షి, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది. సేత్వార్‌ నమోదులో జరిగిన పొరపాట్లను సవరించి ఒక సర్వే నంబర్‌లోని భూముల హెచ్చుతగ్గులను నమోదు చేసేందుకు అవకాశం కలి్పంచింది. ఈ మేరకు ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చి న కొత్త ఆప్షన్లపై భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిట్టల్‌ జిల్లా కలెక్టర్లకు గురువారం సమాచారం పంపారు.

వాస్తవానికి, ధరణి పోర్టల్‌లో సర్వే నంబర్లలోని భూములను నమోదు చేసే విషయంలో కొన్నిచోట్ల పొరపాట్లు జరిగాయి. కొన్ని సర్వే నంబర్లలో ఉన్న వాస్తవ భూమి విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. దీంతో ఆ భూమి నమోదైన మేరకు మాత్రమే రైతులకు పాసు పుస్తకాలు ఇవ్వడంతోపాటు క్రయవిక్రయ లావాదేవీలకు ధరణి పోర్టల్‌ అనుమతినిచ్చి ంది. తద్వారా ఆ భూమిలో ఏళ్లుగా కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న రైతులకు పాసు పుస్తకాలు రాకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది.

ఇప్పుడు సేత్వార్‌ నమోదు, సవరణలకు ధరణి పోర్టల్‌లో అవకాశం ఇవ్వడంతో ఈ సమస్యకు చెక్‌ పడుతుందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయేతర భూములను ఒకరి కంటే ఎక్కువ మంది అమ్మేందుకు, కొనేందుకు అవకాశముంది. కానీ, ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ఇప్పటివరకు ఒక్కరి పేరు మీదనే జరిగేవి. దాన్ని మార్చడం ద్వారా ఒకరి కంటే ఎక్కువ మంది భూమి అమ్మేందుకు, భూమి కొనేందుకు అవకాశం కలగనుంది.

ఇక, భూసేకరణ సమయంలో గత మూడేళ్ల కాలంలో జరిగిన లావా దేవీల సగటు విలువను లెక్కించి పరిహారాన్ని రైతుకు చెల్లిస్తారు. దీనికి అవసరమైన మార్కెట్‌ విలువ సర్టిఫికెట్‌ను ధరణి పోర్టల్‌ ద్వారా ఇచ్చే ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భూములను మార్ట్‌గేజ్‌ (తనఖా) చేసుకునేందుకు అడుగుతున్న కుల ధ్రువీకరణ పత్రం అవసరం లే కుండా మార్పులు చేశారు. సదరు భూ యజమాని ఎస్టీ అని సంబంధిత తహసీల్దార్‌ నమోదు చేస్తే సరిపోయేలా మార్పు చేశారు. 

టీఎం 33 మాడ్యూల్‌లో.. 
ధరణి పోర్టల్‌లో రైతులు ఎక్కువగా ఉపయోగించుకునే టీఎం33 మాడ్యూల్‌ను తాజా మార్పుల్లో మరింత సులభతరం చేశారు. ఉదాహరణకు గతంలో టీఎం 33 ద్వారా పేరు మార్పు చేయాలనుకుంటే ఆ పేరుతోపాటు ఇతర వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి వచ్చేది. ఆ క్రమంలోనే ఇతర వివరాల నమోదులో పొరపాట్లు దొర్లి కొత్త సమస్యలు వచ్చేవి.

అలా కాకుండా ఇప్పుడు టీఎం33 మాడ్యూల్‌ ద్వారా పేరు, లింగం, ఆధార్, కుల కేటగిరీల్లో ఏది అవసరమైతే దాన్ని మాత్రమే సరిదిద్దుకునేలా, ఇతర వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా మార్పులు చేశారు. పాసుపుస్తకాల దిద్దుబాటు క్రమంలో కలెక్టర్లు వెనక్కు పంపిన దరఖాస్తుల వివరాలకు సంబంధించిన రిపోర్టు అందుబాటులో ఉండేది కాదు.

ఇప్పుడు ఎక్సెల్‌ ఫార్మాట్‌లో ఆ రిపోర్టు అందుబాటులో ఉండేలా ధరణి పోర్టల్‌లో మార్పులు చేయడం గమనార్హం. అదేవిధంగా గ్రామ పహాణీలు కలెక్టర్‌తోపాటు సీసీఎల్‌ఏ లాగిన్‌లో కూడా అందుబాటులో ఉండేలా మార్పులు చేశారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)