Breaking News

భారతీయ భాషలను కాపాడుకోవాలి: గవర్నర్‌ 

Published on Sat, 08/27/2022 - 02:08

నాంపల్లి (హైదరాబాద్‌): భారతీయ భాషలను కాపాడుకోవాలని, తాను తమిళనాడులో పుట్టినప్పటికీ తెలంగాణ సోదరిగా తెలుగు నేర్చుకుంటున్నానని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఆధ్వర్యంలో నందమూరి తారకరామారావు కళామందిరంలో ఏర్పాటు చేసిన సంస్కృతి పురస్కార ప్రదానోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆమె తమిళనాడులో తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షిస్తూ వాటి పరివ్యాప్తి కోసం కృషి చేస్తున్న ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు చిల్లకూరు ముద్దు కృష్ణారెడ్డికి సంస్కృతి పురస్కారాన్ని అందజేసి ప్రసంగించారు. మండలి వెంకటకృష్ణారావు తెలుగుభాషా ప్రేమికుడిగా, గాంధేయవాదిగా, ప్రజల మనిషిగా సమాజసేవ చేశారని, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన సంస్కృతి పురస్కారాన్ని కృష్ణారెడ్డికి అందజేయడం అభినందనీయం అన్నారు. కార్య క్రమంలో తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య కిషన్‌రావు, ఏపీ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఆచార్య వై.రెడ్డి శ్యామల  విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్, డాక్టర్‌ విజయ్‌పాల్‌ పాత్‌లోత్‌  తదితరులు పాల్గొన్నారు.  
 
 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)