కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
2024 నాటికి క్షయరహిత తెలంగాణ
Published on Wed, 09/14/2022 - 02:26
సాక్షి, హైదరాబాద్: 2025 నాటికి క్షయరహిత దేశం సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో క్షయ నిర్మూలనకు విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వహించాలని రెడ్‌క్రాస్ వలంటీర్లను గవర్నర్ తమిళిసై కోరారు. 2024 నాటికి క్షయరహిత తెలంగాణ సాధించాలని ఆమె లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆమె మంగళవారం రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం, మందులు అందించడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే, అన్ని జిల్లాల రెడ్‌క్రాస్ శాఖలకు ఎన్నికలు జరపాలని, మండల, డివిజన్ స్థాయిల్లో రెడ్‌క్రాస్ శాఖలను ఏర్పాటు చేయాలని గవర్నర్ సూచించారు. జూనియర్, యూత్ రెడ్‌క్రాస్, యాక్టివ్ వలంటీర్ల నమోదుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Tags : 1