Breaking News

హైదరాబాద్‌లో ప్ర‌భుత్వ భూముల రీ స‌ర్వే.. రంగంలోకి సర్వేయర్లు 

Published on Thu, 10/17/2024 - 19:30

హైదరాబాద్‌ రెవెన్యూ యంత్రాంగం సర్కారు భూములపై రీ సర్వేకు సిద్ధమైంది. ప్రభుత్వ భూముల కబ్జాల కట్టడికి ఉపక్రమించింది. ఇప్పటికే ల్యాండ్‌ బ్యాంకులో ఉన్న పార్శిల్స్‌ సైతం ఆక్రమణకు గురవుతుండడాన్ని తీవ్రంగా పరిగణించింది. సర్వేయర్లను రంగంలోకి దింపి మరోమారు ప్రభుత్వ భూములు రీ సర్వే చేయించాలని నిర్ణయించింది. క్షేత్ర స్థాయిలో పార్శిల్స్‌ వారిగా భూములను పరిశీలించి సమగ్ర  నివేదికలు రూపొందించాలని నిర్ణయించింది. రెండు రోజుల క్రితం అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వెంకటాచారి సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కార్యాలయంలో మండలాల సర్వేయర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షించారు. తాజాగా ప్రభుత్వ భూములన్నింటిని పరిశీలించి సంబంధిత స్థలంలో కొలతలు చేసి వివరంగా మ్యాపులను తయారుచేయాలని ఆదేశించారు.

రంగంలో 17 మంది సర్వేయర్లు 
అధికార యంత్రాంగం సర్కారు భూముల రీ సర్వే కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాలోని 16 మండలాల్లో సుమారు 17 మంది సర్వేయర్లు ఉన్నారు. గోల్కొండ మండలానికి మాత్రం ఇద్దరు సర్వేయర్లు ఉన్నారు. క్షేత్ర స్థాయిలో పార్శిల్‌ వారిగా సర్వే నిర్వహించి ఈ నెల 31 వరకు నివేదిక సమర్పించేలా ఆదేశించారు.

ఇదీ పరిస్థితి 
u హైదరాబాద్‌ జిల్లా రెవెన్యూ పరిధిలో సుమారు 16 మండలాలు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు 1075 ల్యాండ్‌ పార్శిల్స్‌లున్నట్లు రెవెన్యూ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
u  అందులో 890 ల్యాండ్‌ పార్శిల్స్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా 40,66,914.08 చదరపు గజాల విస్తీర్ణం గల ఖాళీ స్థలం ఉంది. 
u  మిగితా పార్శిల్స్‌లో సుమారు 11,45,334.95 చదరపు గజాల విసీర్ణం గల ఖాళీ స్థలం ఆక్రమణకు గురై ఉన్నట్లు తెలుస్తోంది.  

u  సుమారు 169 పార్శిల్స్‌లోని దాదాపు 11,93,595.12 చదరపు గజాల విస్తీర్ణ గల ఖాళీ స్ధలంతోపాటు 445098.64 చదరపు గజాలా ఆక్రమిత భూమి కోర్టు కేసుల్లో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 

చ‌ద‌వండి:  ‘బిల్డర్ల’ బాధితులకు హైడ్రా అండ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)