Breaking News

8 మంది టీచర్లు.. 9 మంది విద్యార్థులు

Published on Wed, 07/15/2026 - 03:35

వీణవంక (హుజూరాబాద్‌): కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్కుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు లేక వెలవెలబోతోంది. హెచ్‌ఎంతో పాటు 8 మంది ఉపాధ్యాయులుండగా ఒకరు డిప్యుటేషన్‌పై ఇతర స్కూల్‌కు వెళ్లారు. దీంతో హెచ్‌ఎంతో కలిపి ఏడుగురు ఉపాధ్యాయులుండగా.. విద్యార్థులు తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. 6వ తరగతిలో ఇద్దరు, ఏడులో ఒకరు, ఎనిమిదిలో ఇద్దరు, తొమ్మిదిలో ఒకరు, పదిలో ముగ్గురు విద్యార్థులున్నారు. పాఠశాలలో కంప్యూటర్‌ ల్యాబ్, డిజిటల్‌ బోర్డుతో పాటు అన్నీ మౌలిక వసతులున్నా విద్యార్థుల్లేరు. రెండేళ్లుగా విద్యార్థులు సరిపడా లేకున్నా ఉపాధ్యాయులు మాత్రం కొలువు తీయడంపై విమర్శలు వస్తున్నాయి. 

ఒకప్పుడు ఉత్తమ పాఠశాలగా గుర్తింపు పొంది ఇప్పుడు విద్యార్థుల్లేని దుస్థితి నెలకొంది. పాఠశాలకు ఆనుకొని కూత వేటు దూరంలో మోడల్‌ స్కూల్‌ ఉంది. ఈ పాఠశాలను అందులో కలపాలని అధికారులు చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై హెచ్‌ఎం శ్రీనివాస్‌ను వివరణ కోరగా వేసవి సెలవుల్లో ఇంటింటికీ తిరిగాము కానీ విద్యార్థులు రాలేదని చెప్పుకొచ్చారు. అలాగే ఎంఈవో శోభారాణిని వివరణ కోరగా గ్రామానికి అర కిలోమీటర్‌ దూరంలో మోడల్‌ స్కూల్‌ ఉందని, దీంతో విద్యార్థులు ఆ స్కూల్‌కే వెళ్తున్నారని అందుకే సంఖ్య తగ్గిందని తెలిపారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)