Breaking News

‘ఇందిరమ్మ’గా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు..!

Published on Mon, 01/20/2025 - 03:57

సాక్షి, హైదరాబాద్‌: పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లతోపాటు అసంపూర్తిగా ఉన్న వాటిని సిద్ధం చేసి.. ఇందిరమ్మ లబ్ధిదారులకు అందజేయబోతోంది. తొలి విడత ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా ఉన్న వారికే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. తాజాగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లున్న ప్రాంతాల్లో.. వాటిని సొంత జాగా లేని అర్హులైన నిరుపేదలకు అందజేయాలని నిర్ణయించింది. 

దాదాపు లక్షన్నర డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు సొంత జాగా లేని ‘ఇందిరమ్మ’లబ్ధిదారులకు అందనున్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2.90 లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వాటిలో 2.28 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. కానీ, లబ్ధిదారుల ఎంపిక చేయకుండానే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం ఆక్షేపించి, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన నిధులను పూర్తిగా ఇవ్వకుండా నిలిపేసింది. 

సొంత నిధులను కావాల్సినన్ని కేటాయించకపోవటంతో ఆ ఇళ్ల నిర్మాణం మందగించింది. చివరకు పథకమే గందరగోళంగా మారింది. ఇప్పుడు ఆ ఇళ్లలో దాదాపు 60 వేలను లబ్ధిదారులకు మంజూరు చేయగా, మిగతావి వృధాగా ఉన్నాయి. పూర్తయిన వాటిని, అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసి.. ఇందిరమ్మ పథకం కింద పంపిణీ చేయాలని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. అసంపూర్తి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఆ పనులు జరుగుతున్నాయి.  

సొంత జాగా లేనివారికి కూడా జాబితాలో చోటు.. 
ఈ నెల 21 నుంచి ఊరూరా గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయబోతున్నారు. ఈ దఫాలో కేవలం సొంత జాగా ఉన్న వారికే ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కానీ, సొంత జాగా లేనివారిలో అర్హులైనవారిని గుర్తించి, వారి జాబితాను కూడా సిద్ధం చేయాలని తాజాగా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. గ్రామ సభల్లో వారి జాబితాను కూడా ప్రదర్శించాలని పేర్కొంది. 

ప్రజా పాలనలో భాగంగా అందిన దరఖాస్తుల్లో సొంత జాగా లేని వారి వివరాలను కూడా తనిఖీ చేసి, వారు అర్హులైతే ఆ జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. తనిఖీ కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో, ఇక గ్రామ సభల్లో అర్హుల జాబితాను రూపొందించటమే తరువాయి. అలా సొంత జాగా లేని అర్హులున్న గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఉంటే.. వాటిని వారికి మంజూరు చేస్తారు. అందుకోసం కలెక్టర్లు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)