Breaking News

79,574 ఎకరాల్లో పంటనష్టం

Published on Thu, 10/10/2024 - 04:21

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆగస్టు 31 నుంచి సెపె్టంబర్‌ 6వ తేదీ వరకు కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 79,574 ఎకరాలలో పంటనష్టం సంభవించినట్టు అధికారులు నిర్ధారించారు. దానికి సంబంధించి పంట ష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ.79.57 కోట్ల నిధులు విడుదల అయ్యాయి’అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పంటనష్టం 28,407 ఎకరాల్లో ఆ తర్వాత మహబూబాబాద్‌లో 14,669, సూర్యాపేటలో 9,828 ఎకరాల్లో ఉందన్నారు. మిగతా 22 జిల్లాలకు సంబంధించి అత్యల్పంగా 19 ఎకరాల నుంచి 3,288 ఎకరాల వరకు పంటనష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. పంట నష్ట పరిహారం ఎకరానికి రూ. 10 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాలలోనే జమ అయ్యేటట్టు అధికారులు ఏర్పాటు చేసినట్టు తుమ్మల తెలిపారు. 

4.15 లక్షల ఎకరాల్లో నష్టమన్న సీఎం
రాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలకు 4.15 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అధికారులు మాత్రం చివరకు 79,574 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని తెలిసి, ఆ మేరకే నిధులు కేటాయించారు. అంటే ముఖ్యమంత్రి చెప్పిన దానికంటే ఐదోవంతు కంటే తక్కువగా నష్టాన్ని నిర్ధారించారు. 

దీంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఇదిలా ఉండగా పంట నష్టం జరిగిన దాంట్లో దాదాపు 25 శాతం ఇసుకమే ట పేరుకుపోయి నష్టం సంభవించింది. ఇసుక మేటకు పదివేలకు అదనంగా ఇస్తా మని కూడా వ్యవసాయ శాఖ వర్గాలు హామీ ఇచ్చాయి. కానీ ప్రస్తుతం ప్రకటించిన పరిహారంలో ఇసుకమేట విషయం లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)