Breaking News

ఫ్యూచర్‌ సిటీ టు అమరావతి..

Published on Mon, 08/18/2025 - 04:51

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నాలుగో నగరి.. ఫ్యూచర్‌ సిటీతో రాష్ట్రాభివృద్ధి మరో దశకు చేరనుందని పరిశీలకులు అంటున్నారు. భవిష్యత్తు నగరాన్ని వచ్చే వెయ్యేళ్ల అవసరాలను తీర్చేలా, ఒక నమూనాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్న సర్కా­రు.. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి సారించింది. 

ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌ సిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి మధ్య ఎనిమిది లైన్ల గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించాలని నిర్ణయించింది. ఈ రహదారి నిర్మాణం తర్వాత హైదరాబాద్‌–విజయవాడ మధ్య దూరం 70 కిలో మీటర్ల మేర తగ్గుతుందని చెపుతున్నారు. 

మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు.. 
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మక రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌), రీజనల్‌ రింగ్‌ రైల్, ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈ ప్రాజెక్టులను ఓడరేవుతో అనుసంధానిస్తే జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య రవాణాతో పాటు బహుళ జాతి సంస్థలు, పెట్టుబడిదారులను ఆకర్షించడం సులువవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 

ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌ సిటీని ఏపీలోని మచిలీపట్నంలో బందరు పోర్టుకు అనుసంధానించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. దీనికి త్వరలోనే అనుమతి మంజూరు అవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్‌ఆర్‌ఆర్‌ వెంట రెండు డ్రై పోర్ట్‌లు.. 
ఆర్‌ఆర్‌ఆర్, రీజనల్‌ రింగ్‌ రైల్‌ ప్రాజెక్టులకు కూడా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. రీజనల్‌ రింగ్‌ రైల్‌ను బందరు పోర్టు లేదా ఇతర ఓడరేవుతో అనుసంధానించే ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు ట్రిపుల్‌ఆర్‌ వెంట రెండు డ్రై పోర్ట్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెదక్, చౌటుప్పల్‌ లేదా ఖమ్మం వద్ద వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

తెలంగాణ రైజింగ్‌.. 
రాష్ట్రాన్ని కోర్‌ అర్బన్‌ (ఓఆర్‌ఆర్‌ లోపల), సెమీ ఆర్బన్‌ (ఓ­ఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య), గ్రామీణ (ఆర్‌ఆర్‌ఆర్, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల మధ్య) ప్రాంతం.. అని మూడు భాగాలుగా విభజించిన సర్కారు.. వీటిని సేవా, పారిశ్రామిక, వ్యవసాయ కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 

2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌ పాలసీ డాక్యు­మెంట్‌ను రూపొందించనుంది. దీనిని వచ్చే డిసెంబర్‌ 9న వి­డు­దల చేయనుందని తెలుస్తోంది. ఆ రోజు కాంగ్రెస్‌ అగ్ర నా­యకురాలు సోనియాగాంధీ జన్మదినం కావడం గమనార్హం.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)