Breaking News

కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుటుంబానికి కోటి ఆర్థిక సాయం: డీజీపీ

Published on Mon, 10/20/2025 - 14:13

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడేందుకు పోలీసు శాఖ నిబద్ధతో ఉందని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్యకేసు నిందితుడు రియాజ్‌ ఎన్‌కౌంటర్‌ను డీజీపీ శివధర్‌రెడ్డి దృవీకరించారు.

ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుటుంబానికి అండగా ఉంటాం. కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుటుంబానికి రూ.కోటి ఆర్ధిక సాయం, ప్రమోద్‌ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. 300గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తాం. ప్రమోద్‌ ఉద్యోగ విమరణ పొందే వరకు వచ్చే శాలరీని వారి కుటుంబానికి అందిస్తాం.దీంతో పాటు ప్రమోద్‌ కుటుంబానికి పోలీస్‌ భద్రత సంక్షేమం నుంచి రూ.16లక్షలు,పోలీస్‌ వెల్ఫేర్‌ నుంచి రూ.8లక్షల పరిహారం ఇస్తాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి. కానిస్టేబుల్‌ ప్రమోద్‌కు పోలీస్‌ శాఖ తరుఫున నివాళులు’ అని తెలిపారు.  

రియాజ్‌ ఎన్‌ కౌంటర్‌
కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు రియాజ్‌(24) ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఇంతకు ముందు ఇలాంటి ప్రచారమే జరగ్గా.. పోలీసులు దానిని ఖండించిన సంగతి తెలిసిందే. అయితే.. స్వయంగా తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు.

నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్‌ సోమవారం పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ నుంచి గన్‌ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆపై పారిపోతున్న రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరపగా.. అక్కడిక్కడే మృతి చెందాడు.

రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. ‘‘పోలీసుల కాల్పుల్లోనే రియాజ్‌ చనిపోయాడు. ఆస్పత్రి నుంచి పారిపోతున్న క్రమంలో అతను మరోసారి దాడికి తెగబడ్డాడు. బయట కాపలా ఉన్న పోలీసుల దగ్గర ఉన్న వెపన్‌ లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఒకవేళ రియాజ్‌ గన్‌పైర్‌ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవే. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అని అన్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)