140 మంది భారతీయులను విడిపిస్తాం

Published on Wed, 02/19/2025 - 04:18

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉపాధి పేరుతో బ్యాంకాక్‌ వెళ్లి అక్రమంగా మయన్మార్‌లో చిక్కుకుపోయిన 140 మంది భారతీయ యువకుల కుటుంబాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ జోక్యంతో విదేశాంగశాఖ స్పందించింది. బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్రమంగా సైబర్‌ కేఫ్‌ల నిర్వహణ, అక్కడ యువకులను నిర్బంధించడం, హింసించడం వంటి ప్రతికూల చర్యలతో మయన్మార్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. 
 
మాయ్‌ సాట్‌ ద్వారా ఇండియాకు.. 
అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లతో మయన్మార్‌ అధికారు లు భారత దౌత్య కార్యాలయానికి సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈలోపు బాధితులను ఇండియాకు పంపించేందుకు దౌత్య కార్యాలయం కూడా రోడ్‌మ్యాప్‌ రూపొందించుకునే పనిలో ఉంది. వాస్తవానికి వీరిని బ్యాంకాక్‌ నుంచి దాదాపు 505 కి.మీ.ల దూరంలో ఉన్న మయన్మార్‌లోని మైవాడీ జిల్లాకు బలవంతంగా తరలించారు. 

తిరిగి వీరిని బ్యాంకాక్‌ కాకుండా.. మైవాడీలోని మోయే నది దాటి కేవలం 11 కి.మీ.ల దూరంలో ఉన్న థాయ్‌లాండ్‌లోని మాయ్‌సాట్‌ ప్రావిన్స్‌ ద్వారా ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం భారత యువకులంతా మైవాడీలోని కేకే2 పార్క్‌లో బందీలుగా ఉన్నారు.

‘సాక్షి’కి మెయిల్‌
మయన్మార్‌లోని మైవాడీ జిల్లాలో భారతీయ యువకులు చిక్కుకున్న విషయమై ‘సాక్షి’దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ విషయమై సాక్షి మయన్మార్‌ రాజధాని యంగాన్‌లోని దౌత్య కార్యాలయాన్ని సంప్రదించింది. బాధితుల పాస్‌పోర్టులు పంపి వారిని కాపాడాలని కోరింది. 

దీనిపై సానుకూలంగా స్పందించిన దౌత్య కార్యాలయం కాన్సులర్‌ ఆర్‌సీ యాదవ్‌ బందీల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని మంగళవారం ‘సాక్షి’కి మెయిల్‌ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు స్థానిక అధికారులతో చర్చలు మొదలుపెట్టామని తెలిపారు.  

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)