Breaking News

తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్.. 10 కోట్ల బంగారం నొక్కేసిన మేనేజర్

Published on Fri, 07/10/2026 - 18:48

సాక్షి,హైదరాబాద్‌: తక్కువ వడ్డీకే బంగారు రుణాలు ఇస్తామంటూ నమ్మించి నిలువునా ముంచిన ఒక ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్‌బీ  కాలనీలోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ కస్టమర్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా రూ. 10 కోట్ల విలువైన బంగారాన్ని కాజేసిన ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది.

బాధితుల కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ ఫేజ్-6 లోని ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో ప్రియాంక రెడ్డి బ్రాంచ్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో ఆమె కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్ వేసింది. మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ వడ్డీకే బంగారు రుణాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికింది. ప్రియాంక రెడ్డి మాటలు నమ్మి సుమారు 40 మందికి పైగా కస్టమర్లు తమ వద్ద ఉన్న భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను సదరు బ్రాంచ్‌లో తాకట్టు పెట్టారు.

అయితే, కస్టమర్లు ఇచ్చిన బంగారాన్ని అధికారికంగా కాకుండా, వారి నుంచి వడ్డీ డబ్బులను తన వ్యక్తిగత ఖాతాలోకి జమ చేయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా, సదరు బంగారాన్ని తక్కువ వడ్డీ పేరుతో మరో ఫైనాన్స్ సంస్థకు అక్రమంగా బదిలీ చేసినట్లు సమాచారం.

కొద్దిరోజుల తర్వాత కస్టమర్లు తమ లోన్ గడువు ముగిసి, అసలు చెల్లించి బంగారాన్ని తిరిగి ఇవ్వాలని మేనేజర్ ప్రియాంక రెడ్డిని కోరారు. ఆమె కాలయాపన చేస్తూ, బంగారం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతుండటంతో కస్టమర్లకు అనుమానం వచ్చింది. తీరా నిలదీసేసరికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమన్నారు. కస్టమర్ల ఫిర్యాదుపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)