Breaking News

Hyderabad: డెలీషియస్‌ గోల్డ్‌ ఐస్‌క్రీం అంటే అట్లుంటది.. మన హైదరాబాద్‌తోని!

Published on Tue, 08/20/2024 - 13:28

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ అంటేనే వైవిధ్యానికి ఆలవాలం. ఆహర్యంతోపాటు ఆహారంలోనూ విభిన్నతకు అది వేదిక. రకరకాల రుచులకు అడ్డా. ఫుడ్‌ లవర్స్‌కు స్వర్గధామం. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీయే కాదు.. దక్షిణ, ఉత్తర భారత సంప్రదాయ వంటకాలు, వెస్టర్న్‌ ఫుడ్, చైనీస్, జపనీస్‌.. ఇలా ఎన్నో దేశాల ఫుడ్‌ ఇక్కడ దొరుకుతుంది. అలా వారాంతంలో కాస్త డిఫరెంట్‌ ఫుడ్‌ తినాలనుకోవాలే కానీ.. దానికి కొదువే ఉండదు. అట్లుంటది మన హైదరాబాద్‌తోని. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే... బంగారం ఏమైనా తింటామా.. ఏంటి? అని ఎవరైనా మాట వరుసకు అనేవారు ఒకప్పుడు.

కానీ, ఇప్పుడు బంగారాన్ని కూడా తినేస్తున్నారండోయ్‌. గోల్డ్‌ దోశ, గోల్డ్‌ ఇడ్లీ, గోల్డెన్‌ స్వీట్స్‌.. ఇలా బంగారపు పూత ఉన్న ఫుడ్‌ ఐటెమ్స్‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ వరుసలోకి ఐస్‌క్రీం కూడా వచ్చి చేరింది. హైదరాబాద్‌లో కూడా గోల్డ్‌ ఐస్‌క్రీం కూడా దొరుకుతోందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మన నగరంలో అచ్చు 24 క్యారెట్ల గోల్డ్‌ ఐస్‌క్రీం లభిస్తోంది. అదెక్కడ అంటారా? మాదాపూర్‌లోని హూబర్, హోలీలో ఈ ఐస్‌క్రీంను అందుబాటులోకి తీసుకొచ్చారు. మైటీ మిడాస్‌ పేరుతో ఈ ఐస్‌క్రీంను అమ్ముతున్నారు. ఖరీదు జస్ట్‌.. రూ.1,179. సాధారణ కోన్‌లో డిఫరెంట్‌ ఫ్లేవర్స్‌లో సర్వ్‌ చేస్తుంటారు. ఐస్‌క్రీం పైన 24 క్యారెట్ల గోల్డ్‌ పేపర్‌తో అందంగా ముస్తాబు చేసి మనకు అందజేస్తారు. ఇంకేముంది.. ఇక మోస్ట్‌ డెలీషియస్‌ ఐస్‌క్రీంను ఆరగించేయడమే.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)