Breaking News

నేటి నుంచే గోల్కొండ కోట బోనాలు

Published on Thu, 06/26/2025 - 06:43

గోల్కొండ: గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆషాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అమ్మవారికి మొత్తం 9 వారాల పాటు పూజలు నిర్వహించనున్నారు. మొదటి పూజకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టువ్రస్తాలు సమరి్పస్తారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు ప్రత్యేకంగా అలంకరించిన దేవతా విగ్రహాల వాహనాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. జానపద కళాకారులు ప్రత్యేకంగా పాటలు పాడుతూ భక్తులను ఉత్సాహపరుస్తారు. గోల్కొండ ప్రధాన రహదారి నుంచి తొట్టెల ఊరేగింపు వైభవంగా ప్రారంభమవుతుంది. కోటలోని జగదాంభిక, మహంకాళి అమ్మవార్ల దర్శనానికి మొదటి బోనం రోజున వేలాధిగా భక్తులు తరలిరానున్నారు. వీరికి దారి పొడవునా దేవాదాయ శాఖ వారు స్వాగత వేదిక ఏర్పాట్లు చేశారు. 

ఆకట్టుకునే పోతరాజుల విన్యాసాలు..  
బోనాల్లో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వారి విన్యాసాలు చూసేందుకు అన్ని వర్గాల ప్రజలు రోడ్డుకిరువైపులా బారులు తీరి వీక్షిస్తుంటారు. ఓవైపు పోతరాజుల గీంకారాలు, కొరఢా చప్పుళ్లు మరోవైపు శివసత్తుల పునకాలతో మొత్తం ఆధ్యాత్మికత వాతావరణం సంతరించుకోనున్నాది. 

మెట్టు మెట్టుకు బొట్టు.. 
బుధవారం అమావాస్యను పురస్కరించుకుని కోట మెయిన్‌ గేటు నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే మెట్లను మహిళలు బొట్టు పెట్టి అలంకరించారు. నగరం నలుమూలల నుంచి మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో మెట్లతో పాటు మెట్లను ఆనుకుని ఉన్న కోట గోడలకు సైతం బొట్లు పెట్టి అలంకరించారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)