Breaking News

భద్రాచలం: గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తుతున్న వరద

Published on Sun, 07/21/2024 - 11:00

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఉదయo 10 గంటలకు 37.7 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. దీంతో 7 లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు.

పర్ణశాల వద్ద నారా చీరల ప్రాంతం నీట మునిగింది. తెలంగాణాతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న సరిహద్దు రాష్ట్రలైన  ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రలో కురుస్తున్న   భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు పొంగి గోదావరిలోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే భారీ వరదల కారణంగా అనేక చోట్ల రవాణకీ తీవ్ర అంతరాయం కాగా, పలుగ్రామాల్లో విద్యుత్‌ సరాఫరా నిలిచిపోయింది. అధికారులు అప్రమతంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద నీటిమట్టం పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఏజెన్సీ విలీన మండలాల్లో భారీ వర్షాల ప్రభావంతో కొండవాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి సోకిలేరు వాగు, అన్నవరం వాగు కొండరాజుపేట, వాగు చీకటి వాగు, అత్త కోడళ్ళ వాగు ఉదృతంగా ప్రవహించడంతో రహదారులపైకి వరద నీరు చేరుకుంది దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శబరి నది కూడా పోటెత్తి ప్రవహిస్తోంది. శబరి గోదావరి సంగమ ప్రాంతం సముద్రాన్ని తలపిస్తోంది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)