Breaking News

ఆచితూచి 42% ఉత్తర్వులు!

Published on Tue, 07/15/2025 - 01:21

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి ముందుకెళుతోంది. ఇటీవల మంత్రిమండలి ఆమోదించి పంపిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం లభిస్తుందన్న అంచనాతో.. తదుపరి ప్రక్రియలో భాగంగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసే దిశలో అడుగులు వేస్తోంది. 

ఈ జీవో రూపకల్పన కోసం.. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 50 శాతానికి మించి ఇవ్వాలంటూ పంచాయతీరాజ్‌ చట్టం–2018కి చేసిన సవరణ, ఈ మేరకు ఆమోదించిన ఆర్డినెన్స్, నూతన మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్‌ కమిషన్‌ సమర్పించే నివేదికలను ఆధారంగా చేసుకోనుంది. 

ఆర్డినెన్స్‌కు మంత్రివర్గ ఆమోదం అనంతరం కొత్త విధివిధానాలతో మరో నివేదిక ఇవ్వాలని డెడికేటెడ్‌ కమిషన్‌ను కోరిన ప్రభుత్వం.. ఆ నివేదిక వచ్చిన తర్వాత వారం రోజుల్లోపు న్యాయపరమైన చిక్కులకు అవకాశం లేకుండా జీవో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 

ఆర్డినెన్స్‌ను, కమిషన్‌ నివేదికను ప్రస్తావిస్తూ.. 
పంచాయతీరాజ్‌ చట్టం–2018లోని సెక్షన్‌ 285 (ఏ)కు చేసిన సవరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతానికి మించవచ్చు అని మాత్రమే ఆర్డినెన్సులో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్డినెన్సుతో పాటు డెడికేటెడ్‌ కమిషన్‌ ఇచ్చే నివేదిక మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంటారని చెబుతున్నాయి. ఈ జీవో మేరకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దఖలు పడతాయని వివరిన్నాయి.  

చట్టానికి చేసిన సవరణే ప్రాతిపదికగా జీవో 
ప్రభుత్వం జీవో విడుదల చేసే జీవో న్యాయ సమీక్షలోనూ నిలబడే విధంగా అవసరమైన అన్ని అంశాలను ప్రస్తావిస్తూ వివరణాత్మకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పరిమితిని ప్రత్యేక పరిస్థితుల్లో పెంచేందుకు పంచాయతీ రాజ్‌ చట్టానికి చేసిన సవరణనే ఈ జీవోకు ప్రాతిపదికగా ఉంటుందని అంటున్నారు. 

బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వెనుకబాటు స్థాయి, జనాభాకు తగిన ప్రాతినిధ్యం అనే అంశాల ప్రాతిపదికన చట్టాన్ని సవరించామని, ఈ అంశాలన్నింటినీ కూలంకషంగా పేర్కొంటూ రిజర్వేషన్ల పెంపును సమర్థించే కోణంలో జీవోకు రూపకల్పన చేస్తున్నామని వెల్లడిస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)