Breaking News

శుభ్రమైన చేతులు.. ఆరోగ్యకరమైన జీవితం!

Published on Thu, 10/16/2025 - 05:03

కరకగూడెం(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): పరిశుభ్రత అంటే కేవలం ఇల్లు, పరిసరాలే కాదు.. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే కీలకం. కనిపించని సూక్ష్మక్రిములు ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా సబ్బుతో కడుక్కోవడం ప్రధానంగా నిలుస్తుంది. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏటా అక్టోబర్‌ 15న ‘గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే’ నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత, ఆరోగ్యం, అవగాహన జీవితాలను ఎంత మెరుగుపరుస్తాయో చెప్పడమే ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. 

ఈ మేరకు పాఠశాలలు, వైద్యసంస్థల్లో అధికారులు చేతులు కడుక్కోవడం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. వాస్తవానికి ఈ దినోత్సవం బుధవారం ముగిసినా.. విద్యార్థులకు చేతుల శుభ్రతపై అవగాహన కల్పించడాన్ని యంత్రాంగం నిరంతరం కొనసాగించేలా ప్రణాళిక రూపొందించింది. అందుకోసం క్షేత్రస్థాయి నుంచి కార్యాచరణపై అధికారులు దృష్టిపెట్టారు.  

చేతుల పరిశుభ్రతే మొదటి టీకా..  
ఆహారం తినే ముందు లేదా వండే ముందు, టాయిలెట్‌కు వెళ్లి వచ్చాక, దగ్గు లేదా తుమ్ము తర్వాత, పిల్లల సంరక్షణ ముందు, రోగులు, చెత్త, జంతువులను తాకాక చేతులను తప్పనిసరి కడుక్కోవాలి. పైపైన కాక సబ్బు, శుభ్రమైన నీటితో కడిగి తుడుచుకోవడం ప్రధానం. నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌ వాడొచ్చు. తద్వారా మనం తాకే వస్తువుల్లో దాగి ఉండే లక్షలాది సూక్ష్మక్రిములు చేతుల ద్వారా ఆహారంలోకి, ఆపై శరీరానికి చేరి వ్యాధులకు కారణం కాకుండా అడ్డుకోవచ్చు. 

గ్రామీణులకు అవగాహన లోపం.. 
నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై అవగాహన లోపం కనిపిస్తోంది. ముఖ్యంగా టాయిలెట్‌ వెళ్లి వచ్చాక లేదా పిల్లలకు ఆహారం ఇచ్చే ముందు సబ్బు వాడకపోవడం, మొక్కుబడిగా చేతులు కడుక్కోవడంతో అతిసార, వాంతులు వంటివి వ్యాపిస్తున్నాయి. గొత్తికోయ ప్రాంతాల్లో హ్యాండ్‌వాష్ కు బదులు ఇప్పగింజల పొడి, కానుగ పొడి వాడుతున్నా అవగాహన మరింత పెరగాల్సి ఉంది. 

చేతులు కడుక్కోకపోతే అనర్థాలు 
చేతులు కడుక్కోకపోవడం వల్ల కలిగే అనర్థాలు చాలా తీవ్రమైనవి. కంటికి కనిపించని క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించి వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి. టాయిలెట్‌కు వెళ్లివచ్చాక చేతులు కడుక్కోకపోతే మలంలోని సూక్ష్మక్రిములు చేతులకు అంటుకోవడం, అపరిశుభ్రమైన చేతులతో ఆహారం తినడం ద్వారా అవి శరీరంలోకి ప్రవేశించి డయేరియాకు కారణమవుతాయి. 

ఇది చిన్న పిల్లలలో తీవ్రమైన డీహైడ్రేషన్‌కు దారితీసి మరణానికి కారణం కావచ్చు. అపరిశుభ్రమైన చేతులతో ఆహారాన్ని తాకినా, తయారుచేసినా వాంతులు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటికి తోడు టైఫాయిడ్, కలరా కూడా కలిగే ప్రమాదమూ ఉంది. అలాగే, ముఖం, కళ్లు, ముక్కును చేతులతో తాకినప్పుడు క్రిములు శ్వాసకోశంలోకి చేరి ఇన్‌ఫుయెంజా, జలుబు వ్యాపిస్తాయి. అలాగే, కళ్లను రుద్దుకున్నప్పుడు కండ్ల కలక వచ్చే ప్రమాదం ఉంది.

చేతుల శుభ్రతతో ఆరోగ్యం సొంతం
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అంతా గుర్తించాలి. తరచుగా చేతులు కడుక్కోవడం ద్వారా అంటువ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఈ చిన్న అలవాటు కుటుంబ ఆరోగ్య రక్షణలో కీలకంగా నిలుస్తుంది. సబ్బు, నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌ ఉపయోగించొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ‘హ్యాండ్‌ వాషింగ్‌ హీరో’గా మారితే వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుంది.  – డాక్టర్‌ జయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)