గురుకులంలో వసతుల కోసం బాలికల ధర్నా

Published on Fri, 07/17/2026 - 04:08

కొత్తగూడ: ‘అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయి. నెల రోజులుగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏదైనా రిపేర్లు చేయాల్సి వస్తే మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. దీంతో గత్యంతరం లేక రోడ్డెక్కాం’అంటూ మహబూ బాబాద్‌ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని గాందీనగర్‌ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులు వాపోయారు. గురుకులంలో వసతులు కల్పించాలని గురువారం నాడు గురుకులం గేటు ముందు ధర్నాకు దిగారు.

బాలికల ఆవేదన: గురుకులంలో కనీస వసతులు కూడా లేవని, నలుగురు విద్యార్థులు దుప్పట్లను తెరలాగ అడ్డు పట్టుకుంటే వాటి చాటున మిగతా విద్యార్థులు దుస్తులు మార్చుకుంటున్నామని చెబుతూ బాలికలు కన్నీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రూప్‌సింగ్‌ బాలికలకు ధైర్యం చెప్పి రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో మాట్లాడించారు. వారి బాధలను విన్న సీతక్క ‘ఇంత వరకు ఈ విషయం తెలియదని, యుద్ధ ప్రాతిపదికన వసతులు కల్పిస్తామ’ని హమీ ఇచ్చారు. 

సీతక్క హమీతో విద్యార్థులు ఆందోళన విరమించారు. మంత్రి ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు పాఠశాల మరమ్మతులు మొదలుపెట్టారు. పనులు పూర్తయ్యే వరకు విద్యార్థులకు ఐదు రోజుల హోమ్‌సిక్‌ సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిని్పపాల్‌ కల్పన, తనిఖీలు చేయనందున గిరిజన సంక్షేమశాఖ జిల్లా కో ఆర్డినేటర్‌ అశోక్‌ పై సస్పెన్షన్‌ వేటు పడినట్లు సమాచారం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)