Breaking News

తల్లి సెల్‌ఫోన్‌ ఇవ్వలేదని కూతురు..

Published on Mon, 02/10/2025 - 07:35

కౌటాల(సిర్పూర్‌): తల్లి తనకు సెల్‌ఫోన్‌ ఇవ్వలేదని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కుమురంభీం జిల్లా కౌటాల మండల కేంద్రంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్సై మధుకర్‌ కథనం ప్రకా రం.. కౌటాలలోని ప్రగతి కాల నీకి చెందిన బొమ్మకంటి సదానందం, రమాదేవి దంపతులకు కుమారుడు, కుమార్తె స్ఫూర్తి (16) ఉన్నారు. స్ఫూర్తి స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువు తోంది. శనివారం మధ్యాహ్నం కాగజ్‌నగర్‌ నవోదయలో నిర్వహించిన ఇంటర్‌ ప్రవేశ పరీక్ష రాసింది. 

పరీక్ష అనంతరం తండ్రి సదానందం స్ఫూర్తిని ఇంటివద్ద దించి బయ టకు వెళ్లాడు. కాగా, పదో తరగతి స్టడీ మెటీరియల్‌ను చూసుకోవడానికి సెల్‌ఫోన్‌ ఇవ్వాలని స్ఫూర్తి తన తల్లి రమాదేవిని కోరింది. అయితే సెల్‌ఫోన్‌ ఇస్తే గేమ్స్‌ ఆడి సమయం వృథా చేస్తావని, మెటీరియల్‌ను జిరాక్స్‌ తీసుకు వస్తానని ఆమె తెలిపింది. కాసేపటి తర్వాత తల్లి జిరాక్స్‌ సెంటర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి తనకు సెల్‌ఫోన్‌ ఇవ్వ లేదని మనస్తాపం చెందిన స్ఫూర్తి.. ఫ్యాన్‌కు ఉరేసుకుంది. జిరాక్స్‌ పత్రాలతో ఇంటికి వచ్చిన తల్లికి కుమార్తె ఉరి వేసుకుని ఉండడంతో భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది.

 వెంటనే ఇంటికి వచ్చిన అతను కుమార్తెను కిందకు దింపి కౌటాల పీహెచ్‌సీకి తరలించాడు. వైద్యులు పరీక్షించి సిర్పూర్‌(టీ) ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అక్కడికి బాలికను తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిర్పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో స్ఫూర్తి మృతదేహాన్ని ఎస్సై మధుకర్‌ పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)