Breaking News

ప్రాణం తీసిన వేధింపులు

Published on Wed, 01/07/2026 - 08:23

రంగారెడ్డి జిల్లా: తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువకుడు పెడుతున్న వేధింపులను భరించలేక, తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లికి చెందిన సిద్దగోని మహేశ్, ఇదే గ్రామానికి చెందిన ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థిని పూజ(17)ను కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఆమె తనకు దక్కుతుందో.. లేదోనని ఆందోళనకు గురైన మహేశ్‌ నెల రోజుల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చేరి్పంచగా, కోలుకుని ఇంటికి వచ్చాడు. 

ఆ తర్వాత తరచూ పూజకు ఫోన్‌ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చచ్చిపోతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది తెలిసిన మహేశ్‌ యువతిపై మరింత ఒత్తిడి పెంచడంతో మనోవేదనకు గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు, ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. కాగా, మహేశ్‌ బెదిరింపులతోనే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు మంగళవారం ఉద యం పూజ మృతదేహంతో యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. సీఐ, గ్రామస్తు లు నచ్చజెప్పడంతో శాంతించారు. మహేశ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)