Breaking News

జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్.. వన్‌టైమ్ సెటిల్ మెంట్

Published on Mon, 12/22/2025 - 18:53

సాక్షి హైదరాబాద్: నగర వాసులకు జీహెచ్ఎంసీ బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. మహానగర పురపాలక సంస్థ పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్‌కు వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల పెండింగ్‌ బకాయిలపై 90శాతం మినహాయింపు ప్రకటించింది. వినియోగదారుడు కేవలం ప్రాపర్టీ ట్యాక్స్‌తో కలిపి కేవలం 10శాతం చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది.

కాగా ఇటీవల గ్రేటర్‌ హైదరాబాద్ బృహత్ నగరంగా ఆవిష్కృతమైంది. ఔటర్ రింగ్‌ రోడ్డు అనుకోని ఉన్న 20 పురపాలక సంఘాలు, ఏడు నగరపాలక సంస్థలకు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ప్రస్తుత ప్రాపర్టీ ట్యాక్స్ ఆపర్ వీటికి వర్తించనుంది. ఈ లెక్కలతో జీహెచ్ఎంసీకి భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు.
 

జీహెచ్​ఎంసీ విస్తరణ ప్రక్రియను ప్రభుత్వం ఆఘ మేఘాలపై పూర్తి చేసింది. మహానగర విస్తరణకు నవంబర్ 25న మంత్రివర్గం ఆమోదించింది. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందించగా  గవర్నర్ వెంటనే  ఆమోదముద్ర వేశారు. డిసెంబర్ 2న మెుత్తం 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్​ఎంసీలో విలీనమైనట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో గతంలో 150 కార్పొరేటర్ స్థానాల సంఖ్య 300కు పెంచుతూ ప్రభుత్వం  డీలిమిటేషన్  ఉత్తర్వులు జారీ చేసింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)