Breaking News

సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తే ఊరుకోం..!

Published on Thu, 01/15/2026 - 15:32

సాక్షి, హైదరాబాద్‌: విస్తరిత గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కానున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాల్సిందేనని, అందుకోసం ఆమరణ దీక్షకైనా వెనుకాడేది లేదని ఉద్యమానికి శ్రీకారం చుట్టిన బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తన డిమాండ్‌ నెగ్గించుకుంటారా.. లేక వెనక్కు తగ్గుతారా? అన్నది నగరంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డీలిమిటేషన్‌ సైతం ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా అస్తవ్యస్తంగా చేశారని పేర్కొన్న ఆయన సికి ంద్రాబాద్‌ను ముక్కలుగా చేసి మల్కాజిగిరి కార్పొరేషన్‌లో కలిపితే చూస్తు ఊరుకోబోమనే డిమాండ్‌తో సికింద్రాబాద్‌కు చెందిన వివిధ వర్గాలను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే.

 ఈ నెల 17న భారీ ర్యాలీ.. 
సికింద్రాబాద్‌ ఎప్పటినుంచో అటు జీహెచ్‌ఎంసీలో, ఇటు హైదరాబాద్‌ జిల్లాలో భాగంగానే ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగా తాను మారుస్తున్నదంటూ ఏమీ లేదని ఇటీవల సచివాలయంలో జరిగిన  ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. దీంతో సికింద్రాబాద్‌ పేరిట కార్పొరేషన్‌ ఏర్పాటు ఉండబోదనే చాలామంది భావిస్తున్నారు. తన డిమాండ్‌ సాధనకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్న శ్రీనివాస్‌యాదవ్‌.. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఎంజీరోడ్‌ గాంధీ విగ్రహం వరకు పదివేల మందితో భారీ  ర్యాలీ సహా వివిధ కార్యక్రమాలు ప్రకటించారు.  

ముందుకా.. వెనకకా? 
ఉద్యమానికి శ్రీకారం చుడుతూ  బాలంరాయి లీ ప్యాలెస్‌లో వివిధ వర్గాల వారితో ఏర్పాటు చేసిన తొలి  సమావేశంలో సీఎంనుద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు  సికింద్రాబాద్‌ అస్తిత్వం కోసం ఆవేశంలో చేశానని, రాజ్యాంగ పదవుల్లో ఉన్న సీఎం అన్నా, మంత్రులన్నా తనకు గౌరవమేనన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని, పర్సనల్‌ అజెండా అంటూ లేదని స్పష్టం చేశారు.  తన వ్యాఖ్యలపై  అభ్యంతరాలుంటే తప్పకుండా ఉపసంహరించుకుంటానని వ్యాఖ్యానించారు. గట్టి గా మాట్లాడినంత మాత్రాన కొమ్ములొచ్చినట్లు కాదని, ఆత్మాభిమానం, అస్తిత్వం కోసమే తమ పోరాటమన్నారు. సికింద్రాబాద్‌ను కార్పొరేషన్‌గా కానీ, జిల్లాగా కానీ చేయాలని, లేని పక్షంలో ఉన్నది ఉన్నట్లుగానే ఉండాలనేదే తమ అభిమతమన్నారు. దీంతో ఏం జరగనుందన్నది నగర ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. ఏం జరగనుందో చూద్దామనే ధోరణిలో వేచి చూస్తున్నారు.  

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)