Breaking News

Hyderabad: ఆస్తిపన్ను బకాయిలపై రాయితీ ఇవ్వండి

Published on Thu, 02/22/2024 - 18:06

సాక్షి, హైదరాబాద్: వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌(ఓటీఎస్‌)గా ఆస్తిపన్ను బకాయిల పెనాల్టీలపై 90 శాతం రాయితీ సదుపాయాన్ని మరోమారు కల్పించాల్సిందిగా  జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి నివేదించింది. జీహెచ్‌ఎంసీకి ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నే. త్వరలో ముగియనున్న ఈ ఆరి్థక సంవత్సర ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ. 2100 కోట్లు అయినప్పటికీ, గతనెల 20 వరకు రూ.1269 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఆరి్థక కష్టాల్లో ఉంది. 

నెలనెలా సిబ్బంది జీతభత్యాల చెల్లింపులకే కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో పలు పర్యాయాలు కల్పించిన ఓటీఎస్‌ సదుపాయాన్ని మరోమారు కల్పించాల్సిందిగా కమిషనర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ స్కీమ్‌ అమల్లోకి వస్తే ఆస్తిపన్ను బకాయిదారులు  అసలుతో పాటు బకాయిల వడ్డీలపై కేవలం 10 శాతం పెనాల్టీ చెల్లిస్తే సరిపోతుంది. అది ఎందరికో వెసులుబాటుగా ఉండటమే కాక జీహెచ్‌ఎంసీ ఆరి్థక కష్టాల నుంచి గెట్టెక్కేందుకూ ఉపకరిస్తుంది. ఈ అంశాన్ని వివరిస్తూ లేఖ రాశారు. పరిశీలనలోకి తీసుకుని ప్రభుత్వం అవకాశం కల్పించగలదని ఆశిస్తున్నారు. 

ఆస్తిపన్ను బకాయిలు (వడ్డీలపై పెనాల్టీలతో సహా).. 
► 4,95,628 ప్రైవేట్‌ యజమానుల భవనాలకు  సంబంధించి బకాయిలు రూ.1887.59 కోట్లు  కాగా, వడ్డీల పెనాల్టీలతో కలిపి అవి రూ.4522.18 కోట్లకు పేరుకుపోయాయి. 

► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 1800 భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు రూ. రూ.1622.16 కోట్లు కాగా, వడ్డీల పెనాలీ్టలతో సహ అవి రూ.5281.21 కోట్లకు పేరుకుపోయాయి.  

► అన్నీ వెరసి పేరుకు పోయిన మొత్తం బకాయిలు రూ.9803.39 కోట్లు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)