Breaking News

లండన్‌ బ్రిడ్జి పునరుద్ధరణ

Published on Sat, 09/20/2025 - 08:47

సాక్షి,హైదరాబాద్‌ : దీని పేరు లండన్‌ బ్రిడ్జి. కానీ ఇది ఉన్నది మాత్రం పాతబస్తీ యాకుత్‌పురా నియోజకవర్గంలో. ముర్కి నాలా మీద నిర్మించిన ఈ బ్రిడ్జి.. ఎస్సార్టీ కాలనీ, మదీనా నగర్‌ ప్రాంతాల మధ్య వారధిగా ఉంది. ఎంతో కాలం క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి దెబ్బతింది. ప్రతి రోజూ వేలాదిమంది రాకపోకలు సాగిస్తారు. ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రమాదకరంగా మారింది. ఈ బ్రిడ్జి నుంచి రైల్వే బ్రిడ్జి వరకు పక్కనే ఉన్న నాలా రిటైనింగ్‌ వాల్‌ సైతం దెబ్బతింది. దీనివల్ల కూడా  ప్రమాదాలకు ఆస్కారం ఉంది. ముఖ్యంగా, వర్షాకాలంలో పొంగిపొర్లే వరదనీటితో పరిసర ప్రాంతాల ప్రజలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదాలు జరగకముందే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, బ్రిడ్జిని పునరి్నరి్మంచాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ చేసిన విజ్ఞప్తి మేరకు జీహెచ్‌ఎంసీ మెయింటనెన్స్, ప్రాజెక్ట్స్‌ విభాగాల చీఫ్‌ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

బ్రిడ్జిని పునరుద్ధరించాల్సిన అవసరం  ఉందని గుర్తించారు. పునరుద్ధరణ పనులకు దాదాపు రూ. 2.95 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. డీటైల్‌ డిజైన్, ఎస్టిమేషన్, ఇన్వెస్టిగేషన్‌ పనుల కోసం కన్సల్టెంట్‌ నియామకానికి సిద్ధమయ్యారు. నిర్మాణాన్ని పేరుకు తగ్గట్లుగా చేయాలని ఎమ్మెల్యే సూచించారు. రెండు వైపులా అప్రోచెస్‌ సహా పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. మేజర్‌ వరద కాలువల అభివృద్ధి పనుల పద్దు కింద జీహెచ్‌ఎంసీ నిధులతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆమోదం కోసం స్టాండింగ్‌ కమిటీ ముందుంచుతున్నారు. వచ్చే మంగళవారం జరగనున్న స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆమోదం లభించగానే వెంటనే పనులు ప్రారంభించనున్నారు.  

మరికొన్ని పనులు  
అల్వాల్‌ సర్కిల్‌లో చిన్నరాయుని చెరువు నుంచి దినకర్‌నగర్‌ వరకు రూ.2.95 కోట్లతో బాక్స్‌ డ్రెయిన్‌ నిర్మాణం, రూ.4.85 కోట్లతో  మల్లేపల్లి ఫుట్‌ బాల్‌ గ్రౌండ్‌ ఆధునీకరణ, తదితర పనుల్ని కూడా ఆమోదం కోసం స్టాండింగ్‌కమిటీ ముందుంచుతున్నారు. 

కార్పొరేటర్ల కుటుంబాలకు మెడికల్‌ ఇన్సూరెన్స్‌ను వారి పదవీ కాలమున్న వచ్చే ఫిబ్రవరి వరకు పొడిగిస్తూ కమిషనర్‌ తీసుకున్న నిర్ణయానికి, వర్షాకాలంలో అవసరమైన చర్యల కోసం జీహెచ్‌ఎంసీ నుంచి హైడ్రాకు వెంటనే రూ.20  కోట్లు విడుదల  చేసేందుకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలపనుంది.   

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)