Breaking News

గడువు ముగిసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీకి మార్గదర్శకాలు: జీహెచ్‌ఎంసీ

Published on Thu, 01/08/2026 - 21:13

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో భవన అనుమతి గడువు ముగిసినప్పటికీ అనుమతించిన ప్లాన్ల ప్రకారమే నిర్మాణం పూర్తిచేసిన నాన్ హైరైజ్ భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) జారీకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
భవన అనుమతులు పొంది, గడువు లోపల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందలేకపోయినప్పటికీ అనుమతించిన ప్లాన్ల మేరకు నిర్మాణం పూర్తి చేసిన భవనాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు.

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల నీటి, విద్యుత్ కనెక్షన్లు (HMWSSB, TSSPDCL) పొందడంలో కొనుగోలుదారులు, గృహ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పాటు, బ్యాంకు రుణాల విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అదనపు పెనాల్టీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వెల్లడించారు.

కేసు–1:
భవన అనుమతి గడువు ముగిసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల లోపు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినట్లయితే, రూల్–26 ప్రకారం పెండింగ్ భవన అనుమతి ఫీజులు, లింక్ రోడ్ ఛార్జీలు, CRMP ఛార్జీలు తదితర వర్తించే రుసుములు వసూలు చేసి దరఖాస్తును పరిశీలిస్తారు.

కేసు–2:
భవన అనుమతి గడువు ముగిసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల తరువాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే, దరఖాస్తు తేదీ నాటికి మొత్తం నిర్మిత విస్తీర్ణానికి వర్తించే అన్ని రుసుములు, ఛార్జీలు వసూలు చేస్తారు.

రెండు సందర్భాల్లోనూ, తప్పనిసరి సెట్ బ్యాక్ లో (ఫ్రంట్ సెట్ బ్యాక్ మినహా) 10 శాతం లోపు వ్యత్యాసాలు ఉన్న భవనాలకే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు నాన్ హైరైజ్ భవనాలకు మాత్రమే వర్తిస్తాయని వెల్లడించింది. ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో పౌరులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే అవకాశం కలుగుతుందని, మౌలిక సదుపాయాల కనెక్షన్లు సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు.

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)