Breaking News

Farm House: అంతా అక్రమమే..

Published on Tue, 07/23/2024 - 11:35

శంషాబాద్‌: ఇటీవల సంచలనం రేపిన  ఎమ్మార్పీఎస్‌ నేతలు నరేందర్, ప్రవీణ్‌లను కిడ్నాప్‌ చేసి బంధించిన ఫాంహౌస్‌ను సోమవారం పోలీసుల బందోబస్తు మధ్య శంషాబాద్‌ మున్సిపాలిటీ అధికారులు నేలమట్టం చేశారు. పట్టణంలోని  103 సర్వే నంబరులో ధర్మగిరి ఆలయానికి సమీపంలో కిడ్నాపర్లు సుమారు వెయ్యి గజాల స్థలంలో ఈ ఫాంహౌస్‌ను నిరి్మంచినట్లు గుర్తించారు.  రెండు మూడేళ్ల క్రితంఎలాంటి అనుమతులు లేకుండా  రెండు రేకుల షెడ్‌లతో పాటు ప్రహరీ, కుక్కలను ఉంచేందుకు ప్రత్యేకంగా ఎనిమిది బోన్లను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో బాతులు, కోళ్లను కూడా పెంచుతున్నారు. కిడ్నాప్‌ సంఘటనతో పాటు అప్రత్తమైన పోలీసులు ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న గుర్తించిన మున్సిపల్‌ అధికారులకు సమాచారం అందించారు. 

అక్రమ నిర్మాణంగా తేలితే కూల్చివేయాలని సూచించారు. ఈ మేరకు  మున్సిపల్‌ కమిషన్‌ బి. సుమన్‌రావు ఆదేశాలతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఇటీవల ఫాంహౌస్‌కు నోటీసులు అంటించారు. సోమవారం మూడు జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు.  కుక్కలతో పాటు, కోళ్లు, బాతులను తీసుకెళ్లేందుకు పశుసంవర్థక శాఖతో పాటు బ్లూక్రాస్‌కు సమాచారం అందించారు. అప్పటి వరకు కుక్కలకు సంబంధించిన బోన్ల కూలి్చవేతను నిలిపివేశారు. ఫాంహౌస్‌ పూర్తిగా అక్రమ నిర్మాణమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే కూల్చివేతల  సమయంలో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ అక్కడికి  రాలేదు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.. 
భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్‌ డీసీపీ సీహెచ్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు. భూ కబ్జాదారులు ఇబ్బంది పెడితే పోలీసులను సంప్రదించాలన్నారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)