Breaking News

అప్పుల ఊబిలో అన్నదాత.. ఆవు వచ్చి రక్షించింది..

Published on Sat, 03/22/2025 - 09:23

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/వేలేరు: కుమ్మరిగూడెం.. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో కేవలం 300 జనాభా, 72 ఇళ్లున్న ఓ కుగ్రామం.. ఇక్కడి అన్నదాతలు ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడారు. ఇప్పుడదే గ్రామం అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిని స్థానికంగా విక్రయించడంతోపాటు అమెరికా, యూకే, జర్మనీ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే అప్పుల ఊబి నుంచి బయటపడి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసింది.  

జర్మన్‌ మహిళ దాతృత్వంతో.. 
సత్యసాయి బాబా భక్తురాలు, దాతృత్వశీలి అయిన మోనికా రేటరింగ్‌(జర్మనీ) భారత్‌లో పర్యటిస్తూ.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలను, ఆపన్నులను ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో 2018లో హైదరాబాద్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలేకర్‌ సాగు విధానంపై శిక్షణ పొందిన కుమ్మరిగూడెంవాసి మారుపాక కోటి, మహర్షి గోశాల నిర్వాహకుడు సర్జన రమేష్‌ ద్వారా కుమ్మరిగూడెం సహా చుట్టుపక్కల గ్రామాల్లో స్వయంగా పర్యటించారు.అన్నదాతల ఇబ్బందులను ఆమె గుర్తించారు. వారిని ఎలాగైనా ఆదుకోవాలనుకున్న మోనికా రేటరింగ్‌.. గ్రామస్తులను పాడిపరిశ్రమ వైపు ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన 30 మంది రైతులను గుజరాత్‌ తీసుకెళ్లి రూ. 50 వేల చొప్పున 30 గిర్‌ జాతి ఆవులను కొనిచ్చారు. అలాగే నెయ్యి తీసే యంత్రాన్ని కూడా రైతులకు అందించారు.

మోనికా రేటరింగ్‌ అందించిన ఆర్థిక చేయూతతో కుమ్మరి గూడెం రైతులు క్రమంగా నిలదొక్కుకున్నారు. ముఖ్యంగా స్వచ్ఛమైన గిర్‌ జాతి ఆవు పాలతో గ్రామస్తులు నెలకు సుమారు 50కిలోల మేర తయారు చేస్తున్న నెయ్యికి  భారీ డిమాండ్‌ ఏర్పడింది.  సాధారణంగా కిలో ఆవు నెయ్యి తయారీకి 20 లీటర్ల పాలు అవసర మవుతుంది. కుమ్మరి గూడెం రైతులు మాత్రం కిలో నెయ్యి (Ghee) తయారీకి 30 నుంచి 35 లీటర్ల పాలను ఉపయో గిస్తున్నారు. స్వచ్ఛతకు మారుపేరుగా మారడంతో కిలో రూ.4 వేలకు పైగా వెచ్చించి మరీ కొంటున్నారు. 

ఆదిలాబాద్, విజయవాడ, విశాఖపట్నం వాసులు కూడా ఫోన్‌ చేసి ఆర్డర్లు ఇస్తున్నారు. అమెరికాలోని డాలస్, యూకేలోని లండన్, జర్మనీలో ఉంటున్న వారు సైతం ఫోన్‌ చేసి నెయ్యి ఆర్డర్‌ చేస్తున్నారు. వారికి స్పీడ్‌ పోస్ట్, కార్గో సర్వీస్‌ల ద్వారా నెయ్యిని పంపిస్తున్నారు. హనుమ కొండ, వరంగల్, హైదరాబాద్‌లలోని ఆయుర్వేద వైద్యులు సైతం ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నారు.

ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతోంది..
నాకున్న ఎకరంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. అలాగే పశుపోషణ చేస్తున్నాను. ప్రస్తుతం ఒక గిర్‌ ఆవు పాలు ఇస్తోంది. ప్రతి నెలా పాలబిల్లు రూ. 7–8 వేలు వస్తోంది. దీంతో మా కుటుంబ నెలవారీ ఖర్చులు, ఇతర అవసరాలకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది. 
– మారుపాక రవి, కుమ్మరిగూడెం గ్రామస్తుడు

ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలి..
మేము గ్రామంలోనే నెయ్యి తయారు చేసి దేశవిదేశాలకు సరఫరా చేస్తున్నాం. ఇక్కడ తయారు చేసిన నెయ్యికి చాలా డిమాండ్‌ ఉంది. మాకు ప్రభుత్వం సహకారం అందించి రుణాలు మంజూరు చేస్తే చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. 
– మారుపాక రాజు, పాలకేంద్రం నిర్వాహకుడు, కుమ్మరిగూడెం

సంతృప్తిగా ఉంది.. 
కుమ్మరిగూడెం (Kummarigudem) ఏడేళ్లలో సాధించిన ప్రగతిని చూసి ఎంతో ఆనందిస్తున్నా. ఇప్పుడు ఈ గ్రామంలో పర్యటిస్తుంటే ఇంగ్లిష్‌ మాట్లాడే యువకులు నా వెంట నడుస్తూ విజయగాథలు వివరిస్తుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. గ్రామస్తులు ఫోన్‌ చేసి వారి ఆవులను చూసేందుకు రావాలని, జీవితంలో ఎంతో బాగుపడ్డామని చెబుతుండటం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది.     
– మోనికా రేటరింగ్‌  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)