Breaking News

హైదరాబాద్‌లో జర్మన్‌ కంపెనీ జీసీసీ

Published on Wed, 11/05/2025 - 03:25

సాక్షి, హైదరాబాద్‌: జర్మనీకి చెందిన దిగ్గజ ఆర్థిక సేవల సంస్థ డోయిచ బోర్స (Deutsche Borse)) తమ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది. భాగ్యనగరంలో జీసీసీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జర్మన్‌ కాన్సుల్‌ జనరల్‌ (చెన్నై) మైఖేల్‌ హాస్పర్‌ సారథ్యంలో డోయిచ బోర్స ప్రతినిధి బృందం మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమైంది. 

జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నందుకు సీఎం ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని.. తమ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను ఆవిష్కరణల కేంద్రంగా తయారు చేసేందుకు సహకరించాలని కోరారు. తెలంగాణ విద్యార్థులు జర్మన్‌ భాష నేర్చుకొనేందుకు వీలుగా హైదరాబాద్‌లో శిక్షకులను నియమించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

పెట్టుబడుల విషయంలో జర్మనీ భాగస్వామ్యాన్ని తెలంగాణ కోరుకుంటున్నట్లు చెప్పారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్‌ రంగాల్లో జర్మన్‌ కంపెనీల పెట్టుబడులను సీఎం ఆహ్వానించారు. టామ్‌కామ్‌ (తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌) ద్వారా వృత్తివిద్య, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమిత దేశాయ్, డోయిచ బోర్స సీఐవో క్రిస్టోఫ్‌ బోమ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

సీఎంను కలిసిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ బృందం
సీఎం రేవంత్‌రెడ్డితో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) ప్రతినిధి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. రాష్ట్రంలో తమ డేటా సెంటర్‌ ప్రాజెక్టులు, వాటి విస్తరణ కోసం చేపట్టనున్న చర్యలను వివరించింది. పెట్టుబడులతో వస్తే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం అమెజాన్‌ బృందానికి హామీ ఇచ్చారు. సమావేశంలో ఏడబ్ల్యూఎస్‌ డేటా సెంటర్‌ గ్లోబల్‌ హెడ్‌ కెర్రీ పర్సన్, ఇన్‌ఫ్రా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ విక్రమ్‌ శ్రీధరన్, అనురాగ్‌ కిల్నానీ తదితరులు పాల్గొన్నారు. 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)