Breaking News

రాబర్ట్‌ లాంగర్‌కు జినోమ్‌వ్యాలీ ఎక్సలెన్స్‌ అవార్డు 

Published on Wed, 02/08/2023 - 03:08

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ నియంత్రణకు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను అభివృద్ధి చేసిన మొడెర్నా సహ వ్యవస్థాపకుడు రాబర్ట్‌ ఎస్‌.లాంగర్‌ ఈ ఏడాదికిగాను జినోమ్‌వ్యాలీ ఎక్సలెన్స్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 24 నుంచి 26 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న 20వ బయో ఆసియా సదస్సులో ఆయనకు ఈ అవార్డు అందించనున్నట్లు బయో ఆసియా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోని డేవిడ్‌ హెచ్‌.కోచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యాపకుడైన రాబర్ట్‌ ఎస్‌.లాంగర్‌... వ్యాధుల చికిత్సకు మందులను నియంత్రిత పద్ధతుల్లో అందించే వ్యవస్థలను అభివృద్ధి చేశారు. వాటిని ప్రస్తుతం కేన్సర్‌ సహా పలు రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. లాంగర్‌ ల్యాబ్స్‌ డైరెక్టర్‌గా ఆయన చేసిన పరిశోధనల కారణంగానే  తొలి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ తయారైంది.

2010లో లాంగర్‌ స్థాపించిన కంపెనీ మొడెర్నా కోవిడ్‌–19 నియంత్రణకు టీకా తయారు చేయడం తెలిసిందే. క్వీన్‌ ఎలిజబెత్‌ ప్రైజ్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌తోపాటు అనేక ఇతర అవార్డులను అందుకున్న రాబర్ట్‌ ఎస్‌.లాంగర్‌ ఇప్పటివరకూ దాదాపు 1,500 పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. జినోమ్‌ వ్యాలీ ఎక్సలెన్స్‌ అవార్డుకు రాబర్ట్‌ ఎస్‌.లాంగర్‌ అన్ని విధాలుగా అర్హుడని, ఆయన పరిశోధనలు రానున్న కాలంలోనూ సమాజంపై ప్రభావం చూపనున్నాయని తెలంగాణ మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)