Breaking News

విద్యార్థులు జీవితంలో ఇన్నోవేటివ్​గా ఎదగాలి: గడ్డం వంశీకృష్ణ

Published on Thu, 10/30/2025 - 12:53

హైదరాబాద్‌: గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 40వ వార్షికోత్సవాలు బుధవారం మాదాపూర్​లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగాయి. గీతాంజలి స్కూల్స్ పూర్వ విద్యార్థి అయిన ఎంపీ వంశీకృష్ణ ఈ వేడుకలకు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ తన స్కూల్ డేస్​ను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్తగా సాధించాలనే పట్టుదల, తపన, క్రియేటివిటీ కలిగి ఉండాలన్నారు.

ఉద్యోగాలు చేయడమే కాకుండా సృష్టించేలా కూడా ఎదగాలన్నారు. సొసైటీ డెవలప్​మెంట్​కోసం పాటుపడుతూ, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువాలని కోరారు. తెలంగాణ నుంచి నేషనల్ అవార్డ్ దక్కించుకున్న స్కూల్ ఫౌండర్, ప్రిన్సిపాల్ గీతా కరణ్ గత 40 ఏళ్లుగా గీతాంజలి విద్యా సంస్థల ద్వారా సోషల్ సర్వీస్ చేస్తూ, గొప్ప విద్యార్థులను సమాజానికి అందిస్తున్నారని కొనియాడారు. వార్షికోత్సవం సందర్భంగా తమ స్కూల్ పూర్వ విద్యార్థి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరుకావడం ఆందంగా ఉందని గీతా కరణ్ అన్నారు.

అనంతరం వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్ షో, డాన్స్ లతో విద్యార్థులు అలరించారు. తర్వాత విద్యా సంస్థల టీచర్స్ సేవలను గుర్తించి అవార్డులను అందించారు. కార్యక్రమంలో స్కూల్ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)