Breaking News

ట్యాంక్‌ బండ్‌ ఫుల్‌.. రెండో రోజు కొనసాగుతున్న నిమజ్జనం

Published on Sun, 09/07/2025 - 07:49

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రెండో రోజు వినాయక నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతోంది. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ దారులన్నీ గణేశుడి ప్రతిమలతో నిండిపోయాయి. మొదటి రోజు నుండి ఇప్పటి వరకూ గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగింది.

ఇక, ఒక్క హుస్సేన్ సాగర్‌లో 11 వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిమజ్జన పాయింట్లు, నిమజ్జన ఊరేగింపు మార్గాలలో వ్యర్థాల తొలగింపును జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. ఇక, టాంక్‌ బండ్‌ పరిసరాల్లో ఇంకా సందడి కొనసాగుతోంది. గణేష్‌ ప్రతిమలు బారులు తీరడంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 

కాగా, ఎల్బీనగర్‌ పరిధిలో 35,994, చార్మినార్‌ 22,304, ఖైరతాబాద్‌ 63,019, శేరిలింగంపల్లి 41,360, కూకట్‌ పల్లి 62,405, సికింద్రాబాద్‌ పరిధిలో 36,251 విగ్రహాలను నిమజ్జనం చేశారు. మరోవైపు.. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్‌లోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. నగరంలో వినాయక నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఎల్బీనగర్ వద్ద మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులు కిక్కిరిసి కనిపించారు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)