Breaking News

రూ.1.53 కోట్ల కరెన్సీతో అలంకరణ

Published on Sat, 08/30/2025 - 18:17

వరంగల్‌ శివనగర్‌లోని వాసవి కాలనీలో వినాయక ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిష్టించిన మట్టి విఘ్నేశ్వరుడిని శుక్రవారం రాత్రి కోటీ యాభై మూడు లక్షల, నూట పదహారు రూపాయల కరెన్సీతో అలంకరించారు. సుమారు 200 మందికిపైగా ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రతి నిధులు, కాలనీవాసులు ఈ కరెన్సీని అందజేశారు. ఈ కార్యక్రమంలో వినాయక ట్రస్టు భవనం అధ్యక్షుడు సాదుల దామోదర్, కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి, కోశాధికారి రావికంటి అశోక్‌ పాల్గొన్నారు.                  
– ఖిలా వరంగల్‌

గణపతి.. ధనపతి
మంచిర్యాల అర్బన్‌: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథస్వామి ఆలయ కాలక్షేప మండపంలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. శుక్రవారం రాత్రి రూ.25,11,116 కరెన్సీ నోట్లతో మండపాన్ని తీర్చిదిద్దారు. భక్తులు కరెన్సీ గణపతిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 

ధననాథుడు  
గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్‌ బజారులో ఆర్యవైశ్య సంఘం, సంకా బాలాజీ గుప్తా యూత్, స్థానిక వ్యాపారుల సహకారంతో ఏర్పాటు చేసిన గణనాథుడు శుక్రవారం ‘ధన’నాథుడుగా దర్శనమిచ్చాడు. ఉత్సవ నిర్వాహకులు రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.   
– మంగళగిరి టౌన్‌

వినాయక లడ్డు, కలశం @రూ.49 లక్షలు
ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం అయ్యలూరివారిపల్లెలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 3వ రోజు శుక్రవారం గణపతి మండపం వద్ద నిర్వహించిన లడ్డు, కలశం వేలంలో లడ్డు రూ.30 లక్షలు, కలశం  రూ.19 లక్షలు పలికింది. వేలంలో లడ్డును అదేగ్రామానికి చెందిన పాలుగుళ్ల మోహన్‌రెడ్డి, కవిత దంపతులు రూ.30,00,116కు దక్కించుకోగా,  కలశాన్ని అదేగ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నారాయణరెడ్డి, సర్పంచ్‌ ముత్యాల భారతీరెడ్డి దంపతులు రూ.19.10 లక్షలు వెచ్చించి దక్కించుకున్నారు.   
– సీఎస్‌పురం (పామూరు) 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)