Breaking News

గణేష్‌ ఉత్సవాలకు సకల ఏర్పాట్లు

Published on Thu, 08/08/2024 - 09:58

అబిడ్స్‌: గణేష్‌ ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నామని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షులు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సిద్ధంబర్‌బజార్‌ బహెతీభవన్‌లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించారు. 

అనంతరం వారు మాట్లాడుతూ భాగ్యనగరం పరిధిలో నిర్వహించే 45వ సామూహిక గణేష్‌ ఉత్సవాల కోసం భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి గ్రేటర్‌ నలుమూలలా 24 నియోజకవర్గాలకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం లక్షకు పైగా గణేష్‌ మండపాలను ప్రతిష్టిస్తామన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన గణేష్‌ ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. 17వ తేదీన అనంత చతుర్ధశి రోజు గణేష్‌ నిమజ్జనం చేస్తామన్నారు. ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్‌ మాట్లాడుతూ దైవభక్తి, దేశభక్తి, దేశ సంస్కృతిని సంరక్షించే విధంగా గణేష్‌ ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. 

రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్‌ కొత్త ప్రభుత్వం తమ ఉత్సవ సమితితో సమన్వయ సమావేశం నిర్వహించి వేడుకలు విజయవంతంగా అయ్యేవిధంగా కృషి చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మెట్టు వైకుంఠం, ఉత్సవ సమితి నాయకులు కౌడి మహేందర్, రమే‹Ù,  శ్రీరామ్‌వ్యాస్, ఆల భాస్కర్, రూప్‌రాజ్, సలహాదారులు కోరడి మాల్, మాధవీలత పాల్గొన్నారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)