Breaking News

భుక్తికి లేకున్నా.. భక్తిలో మిన్న

Published on Sat, 09/06/2025 - 07:51

కోల్‌సిటీ (రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎల్బీనగర్‌ మాతంగి కాంప్లెక్స్‌ ఎదుట రోడ్డు పక్కన ప్లాస్టిక్‌ కవర్లను పైకప్పుగా వేసుకున్న చిన్న గుడిసెలు కనిపిస్తాయి. మట్టి నేలలు, మూటలు, చీపుర్లు, గిన్నెలతో నిండిన చిన్నగదులే అక్కడివారికి నివాసాలు. తాము కడు బీదలమైనా.. మనసు ఎంత గొప్పదో ఓ గుడిసెలోని తొమ్మిదో తరగతి విద్యార్థి చరణ్‌ నిరూపించాడు. తమ గుడిసెల ముందు గణపతి విగ్రహం ప్రతిష్టించి నవరాత్రులు పూజించాలని భావించాడు. కానీ కూలిపని చేసుకునే తల్లిదండ్రులకు స్తోమత లేదు. అయినా, ఆ బాలుడు వెనకడుగు వేయలేదు. 

పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడల్లా ఓ దుకాణంలో పనిచేసి కొంతడబ్బు కూడగట్టుకున్నాడు. ఇందులోంచి రూ.1,500 వెచ్చించి వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేశాడు. ఇంటి ఎదుట తడకలతో మండపం నిర్మించాడు. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అర్చకుడిగా అవతారం ఎత్తాడు. తొమ్మిది రాత్రులపాటు గణపతికి ప్రత్యేక పూజలు చేశాడు. భగవంతుడు విగ్రహంలో కాదు.. భావంలో ఉంటాడు. భక్తికి సామర్థ్యం అవసరం లేదు.. హృదయం చాలు.. అని చరణ్‌ నిరూపించాడు. నవరాత్రులకు తగ్గ ఏర్పాట్లు, అలంకరణలు చేసే స్తోమత లేకపోయినా.. ఆ బాలుడి భక్తి ముందు అవన్నీ దిగదుడుపే అయ్యాయి. 

తొమ్మిదిరోజుల పాటు రోజూ పూజలు చేసి, నైవేద్యం సమర్పించాడు. నిత్యం భక్తిపాటలతో అర్చించాడు. చివరకు శుక్రవారం శోభాయత్ర ఘనంగా నిర్వహించాడు. సమీపంలోని నీటి వనరుల్లో నిమజ్జనం చేశాడు. ఈ సందర్భంగా పులిహోర, మిఠాయిలు కూడా గుడిసెలోనే తయారు చేసి అందరికీ పంచిపెట్టాడు. ఇది చూసిన ప్రతీఒక్కరూ కదిలిపోయారు. ఇది డబ్బుతో చేసేది కాదు.. మనసుతో చేసిన పూజ.. ఈ దృశ్యం మానవాళికి, సమాజానికి ఒక శిక్షణ.. ఈ బాలుడు చూపించిన భక్తి, ధనసామర్థ్యానికి మించిన ఆధ్యాతి్మక సంపదని ప్రశంసలు కురిపించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)