Breaking News

‘గాంధీ’.. ఈ నిర్లక్ష్యం ఏందీ!

Published on Sun, 02/22/2026 - 07:55

సాక్షి, సిటీబ్యూరో/గాందీఆస్పత్రి : అధికారుల అలసత్వం, గుత్తేదారుల నిర్లక్ష్యం వెరసి సామాన్య రోగులకు ప్రాణసంకటంగా మారింది. గాంధీ ఆస్పత్రిలో అత్యాధునిక మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మాణం కోసం 9 ఏళ్ల క్రితం పనులు ప్రారంభించారు. నేటికీ అవి నత్తకు నడకలు నేరి్పనట్లుగా కొనసాగుతున్నాయి. నిధులు, నిష్ణాతులైన సిబ్బంది, ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నా ఆపరేషన్‌ థియేటర్‌ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ థియేటర్‌కు సంబంధించి రూ.30 కోట్ల నిధులు మూలుగుతున్నాయి. 

పెరిగిన అంచనా వ్యయం  
గాంధీ ఆసుపత్రికి రోజుకు కనీసం 2,500 మంది ఓపీ వస్తున్నారు. రెండు వేల పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రి ప్రధాన భవనంలోని 8వ అంతస్తులో లక్ష చదరపు అడుగుల్లో ఆరు మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు నిరి్మంచాలని నిర్ణయించారు. వీటికి అనుబంధంగా ఐసీయూ, స్టెప్‌డౌన్, పర్యవేక్షణ విభాగాలను ఏర్పాటు చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో కొనసాగుతున్న సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాన్ని గాం«దీకి తరలించాలని నిర్ణయించారు. పేపర్‌ వర్క్‌ అద్భుతంగా ఉన్నా నిర్మాణ పనులు మాత్రం దయనీయంగా కొనసాగుతున్నాయి. పనులు ఆలస్యం కావడంతో అంచనా వ్యయం మరో రూ.10 కోట్లు అదనంగా కేటాయించాల్సి వచ్చిందని సమాచారం. గాంధీ ఆసుపత్రిలో అవయవ మారి్పడి కోసం స్టేట్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌ సైతం ఏర్పాటు చేశారు.  

ఎన్నో ప్రయోజనాలు.. 
మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులోకి వస్తే గుండె, హృదయ రక్తనాళాలు, కిడ్నీ, ఊపిరితిత్తులు వంటి అవయవ మారి్పడితోపాటు ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ, కీళ్లమారి్పడి, కాక్లియర్, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, గైనకాలజీ విభాగాల అతి క్లిష్టతరమైన సర్జరీలు కూడా ఇక్కడ పూర్తి చేయవచ్చు. అదే సమయంలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి అవయవ సేకరణకు ఈ థియేటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఉస్మానియా ఆస్పత్రిలో ఇదివరకు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసేవారు. ప్రస్తుతం అవి నిలిచిపోయాయి.

తుదిదశలో నిర్మాణ పనులు  
అవయవ మారి్పడి కోసం ఏర్పాటు చేసిన మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. బెడ్‌ లిఫ్ట్‌ ఏర్పాటుకు భూసార పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఉన్న మూడు లిఫ్టుల్లో ఒకటి 8వ ఫ్లోర్‌కు 
కేటాయించే ఆలోచన ఉంది. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పాం.
– డాక్టర్‌ వాణి, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)