Breaking News

గామా నైఫ్‌.. మెద‌డు చికిత్స‌ల్లో స‌రికొత్త విప్ల‌వం

Published on Thu, 05/15/2025 - 19:13

మెద‌డులో వ‌చ్చే స‌మ‌స్య‌లు.. ప్ర‌ధానంగా క్యాన్స‌ర్ మెటాస్టాటిస్ క‌ణితుల‌ను శ‌స్త్రచికిత్స‌తో తొలగించ‌డం క‌ష్టం అవుతుంది. అలాంట‌ప్పుడు గామానైఫ్ చికిత్స చాలా ప్ర‌యోజ‌న‌క‌రం. ఇందులో రేడియేష‌న్ కిర‌ణాల‌ను కేంద్రీక‌రించి పంపుతారు. మొత్తం 192 గామా కిర‌ణాల‌ను మెద‌డులో ఒకేచోటుకు పంపుతారు. దీనివ‌ల్ల ప్ర‌భావిత ప్రాంతం మీద అధిక‌మోతాదులో రేడియేష‌న్ అందుతుంది. చుట్టుప‌క్క‌ల క‌ణ‌జాలాల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. అత్యంత క‌చ్చితత్వం కోసం ఎంఆర్ఐ లేదా సీటీస్కాన్ లాంటివాటి సాయంతో ఈ చికిత్స చేస్తారు. 

చికిత్స‌కు ముందు రోగి త‌ల క‌ద‌ల‌కుండా ఉండేందుకు ఒక ఫ్రేమ్ పెడ‌తారు. గామా కిర‌ణాలు స‌రిగ్గా ఎక్క‌డ ప‌డాలో చూస్తారు. ఏమాత్రం నొప్పి లేకుండా, కొన్ని గంటల్లోనే అయిపోయే ఈ చికిత్స స‌మ‌యంలో రోగి మెల‌కువగానే ఉంటారు. ఇందులో కోత ఉండ‌దు కాబ‌ట్టి ర‌క్తం పోదు, ఇన్ఫెక్ష‌న్లు రావు, జ‌న‌ర‌ల్ ఎన‌స్థీషియా ఇవ్వ‌క్క‌ర్లేదు. మెద‌డులో వ‌చ్చే క‌ణితులు (క్యాన్స‌ర్, ఇత‌రాలు), ర‌క్త‌నాళాలు స‌రిగా ఏర్ప‌డ‌క‌పోవ‌డం, పిట్యుట‌రీ క‌ణితులు, విప‌రీత‌మైన నొప్పి త‌దిత‌రాల‌కు ఇది బాగా స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. చాలామంది రోగులు అదేరోజు ఇంటికి వెళ్లి, ప‌నులు చేసుకోవ‌చ్చు. ఇది ఒకేసారి చేసే చికిత్స‌. దుష్ప్ర‌భావాలు చాలా త‌క్కువ‌, విజ‌యాల రేటు ఎక్కువ‌.



రోగుల‌కు ప్ర‌యోజ‌నాలివీ.. 
మెద‌డు శ‌స్త్రచికిత్స‌ల‌కు ప్ర‌త్యామ్నాయంగా.. కోత‌, నొప్పి లేని ప‌ద్ధ‌తిని గామా నైఫ్ అందిస్తుంది. దీనివ‌ల్ల రోగుల‌కు స‌మ‌స్య‌లుండ‌వు, వేగంగా కోలుకుంటారు. మెద‌డులో ఉండే ఆరోగ్య‌క‌ర‌మైన క‌ణ‌జాలాల‌ను పాడుచేయ‌కుండా స‌మ‌స్య‌ను మాత్ర‌మే క‌చ్చితంగా తొల‌గిస్తుంది. చాలావ‌ర‌కు ఒకే సెష‌న్‌లో అయిపోతుంది. రోగులు అదేరోజు ఇంటికి వెళ్ల‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు గామా నైఫ్ చికిత్స‌లు ప్ర‌పంచంలో 10 ల‌క్ష‌ల మందికి పైగా రోగులు పొందారు. మ‌న దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 8వేల ప్రొసీజ‌ర్లు చేశారు. కొన్నిర‌కాల మెద‌డు క‌ణితుల‌కు, న్యూరాల్జియా లాంటి స‌మ‌స్య‌ల‌కు ఇది 90% విజ‌యాలు అందిస్తుంది. ఇందులో మిల్లీమీట‌ర్ల స్థాయి క‌చ్చిత‌త్వంతో రేడియేష‌న్ అందిస్తారు. 

దీనికి స‌గ‌టున 30 నిమిషాల నుంచి 2 గంట‌ల వ‌ర‌కు ప‌డుతుంది. ఆస్ప‌త్రిలో చేరాల్సిన అవ‌స‌రం లేదు. చికిత్స అనంత‌రం 24-48 గంట‌ల్లోనే 90% రోగులు త‌మ ప‌నులు చేసుకుంటారు. వైట్ బ్రెయిన్ మెటాస్టాటిస్ క‌ణితులు, ర‌క్త‌నాళాల్లో స‌మ‌స్య‌లు.. లాంటి 20 ర‌కాల స‌మ‌స్య‌ల‌కు ఇది స‌మర్థ‌వంత‌మైన ప‌రిష్కారం. కిమ్స్ ఆస్ప‌త్రిలో పెట్టిన‌ది ఒకే సెష‌న్‌లో ప‌లు క‌ణితుల‌ను కూడా న‌యం చేస్తుంది. దాంతో చికిత్స స‌మ‌యం త‌గ్గుతుంది. న్యూరాల్జియా స‌మ‌స్య‌కు దీంతో చికిత్స చేస్తే 48 గంట‌ల్లోనే నొప్పి బాగా త‌గ్గుతుంది. మొత్తం రోగుల్లో 2% మందికి మాత్ర‌మే కొన్ని ప్ర‌భావాలు క‌నిపిస్తాయి. సంప్ర‌దాయ మెద‌డు శ‌స్త్రచికిత్స‌ల కంటే ఇందులో దుష్ప్ర‌భావాలు దాదాపు లేన‌ట్లే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)