Breaking News

అత్యాచార కేసులో 35 ఏళ్ల జైలు

Published on Fri, 11/14/2025 - 04:16

శాంతినగర్‌/ ఎర్రవల్లి: జోగుళాంబ గద్వాల జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు జడ్జి రవికుమార్‌ సంచలన తీర్పులు వెలువరించారు. ఇద్దరు బాలికల అత్యాచార కేసులకు సంబంధించి నిందితులకు 35, 25 ఏళ్ల జైలుశిక్ష, జరిమానా విధించారు. వివరాలిలా.. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లికి చెందిన ఓ బాలికకు ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపూర్‌కు చెందిన వడ్డె వెంకటరమణ అలియాస్‌ లక్కీ (23)తో పరిచయం ఏర్పడింది. 

ఆ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి హిందూపూర్‌ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లి గతేడాది అక్టోబర్‌ 10న శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు విన్న మేజి్రస్టేట్‌... వెంకటరమణ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి 25 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.40 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.  

మరో ఘటనలో.. 
జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని గార్లపాడుకు చెందిన చాకలి హరిచంద్ర 2017లో బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కోదండాపురం పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ యాదగిరి విచారణ చేపట్టి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 

కేసు పూర్వాపరాలను విన్న జడ్జి రవికుమార్‌ నేరస్తుడు చాకలి హరిచంద్రకు 35 ఏళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానాతోపాటు బా ధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాల ని తీర్పు వెలువరించారు. నిందితులకు శిక్ష ప డేలా కృషిచేసిన డీఎస్పీ, ఎస్‌ఐలు, న్యాయవా దులు, కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందిని ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.  

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)