Breaking News

శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. సలేశ్వరంలో భక్తుల సందడి

Published on Sun, 04/13/2025 - 12:32

అమ్రాబాద్‌: వరుస సెలవుల కారణంగా శ్రీశైలం ప్రధాన రహదారి భక్తులతో  రద్దీగా మారింది. సలేశ్వరానికి వెళ్లేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో, సలేశ్వరానికి వెళ్లే మన్ననూర్‌ చెక్‌పోస్టు వద్ద వాహనాల తాకిడి ఎక్కువైంది. టోల్‌గేట్‌ వద్ద ఛార్జీల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం కావడంతో చెక్‌పోస్టు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని సలేశ్వరానికి వెళ్లేందుకు భక్తులు భారీ సంఖ్యలో​ బయలుదేరారు. ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరగడంతో మన్ననూర్‌ చెక్‌పోస్టు వద్ద చార్జీల చెల్లింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో, 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్ధాపూర్‌ క్రాస్‌ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను భక్తులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)