Breaking News

ఐఐటీ, ఐఐఎంల్లోని బీసీ విద్యార్థులకు...పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హర్షం

Published on Thu, 07/27/2023 - 02:36

ముషీరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎంలో చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని ప్రకటించడాన్ని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లపల్లి అంజి హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే సుమారు ఐదున్నర లక్షల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇక్కడ మాత్రం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించకపోగా కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో విద్యార్థులను కళాశాలల యాజమాన్యం విద్యాభ్యాసం పూర్తయినా సర్టీఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అడ్మిషన్‌ ఇవ్వాలని, అవసరమైతే అదనపు సెక్షన్‌లు తెరవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల మెస్‌ చార్జీలను రూ. 1575 నుంచి రూ. 2500లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. విదేశీ విద్యను 300 మందికి మాత్రమే ఎందుకు కుదించారని ప్రశ్నించారు.  
బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎం చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంసీఏ చదివే విద్యార్థులకు ఎందుకు నిరాకరిస్తుందని ఇది సవతి తల్లి ప్రేమ కాదా అని ప్రశ్నించారు. బీసీ హాస్టల్స్‌కు ఒక్క సొంత భవనం కూడా లేదని అద్దెలకు మాత్రం కోట్లాది రూపాయలు చెల్లిస్తూ అధికారులు మధ్య దళారుల పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.  

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)