Breaking News

యూఏఈకి ఉచిత వీసాలు.. విమాన టికెట్స్‌

Published on Mon, 03/17/2025 - 19:31

మోర్తాడ్‌: నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ ప్రభుత్వరంగ సంస్థ ఏడీఎన్‌హెచ్‌ ఉచిత వీసాలను జారీ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఇంటర్వ్యూలు నిర్వహించి అనేకమంది నిరుద్యోగులకు యూఏఈలో ఉపాధి అవకాశాలు కల్పించింది. ఆ సంస్థకు చెందిన లైసెన్స్‌డ్‌ ఏజెన్సీ జీటీఎం ఆధ్వర్యంలో మరోసారి వీసాల జారీ కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 21, 22 తేదీలలో జగిత్యాల, నిజామాబాద్‌లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కేటరింగ్, సపోర్టింగ్గ్‌ సర్వీసెస్‌ రంగంలో వలస కార్మికులకు ఉచిత వీసాలను జారీ చేయనున్నట్లు పేర్కొంది.

ఈసీఎన్‌ఆర్‌ పాస్‌పోర్టు (ECNR Passport) కలిగి, బేసిక్‌ ఇంగ్లిష్‌ మాట్లాడేవారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని జీటీఎం సంస్థ చైర్మన్‌ సతీశ్‌రావు కోరారు. 250 మందికి వీసాలు జారీ చేసే అవకాశం ఉందన్నారు. భారతీయ కరెన్సీలో రూ.23 వేల వేతనం, ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. వీసాల కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

వీసాల జారీతో పాటు యూఏఈకి వెళ్లడానికి విమాన టికెట్‌ను సంస్థే ఉచితంగా సమకూరుస్తుందని వెల్లడించారు. ఆసక్తిగలవారు 86868 60999 (నిజామాబాద్‌), 83320 62299 (ఆర్మూర్‌), 83320 42299 (జగిత్యాల), 93476 61522 (సిరిసిల్ల) నంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకుని టోకెన్లు పొందాలని సూచించారు. 

అమెరికాలో విషాదం.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)