Breaking News

నేటి నుంచి బియ్యం పంపిణీ

Published on Sat, 08/01/2026 - 12:19

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలలకు సంబంధించి సన్నబియ్యం ఒకేసారి ఇవ్వనున్నారు.

 ఈ మేరకు మండల్‌ లెవల్‌ స్టాక్‌ పాయింట్ల నుంచి జూలై 28వ తేదీ నుంచి రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా అవుతున్నాయి. చిన్న దుకాణాలకు ఒకేసారి, పెద్ద దుకాణాలకు రెండుసార్లు బియ్యం రవాణా చేసి నిల్వ చేయనున్నారు. ఇందుకోసం జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రేషన్‌కార్డుదారుడు మూడుసార్లు వేలిముద్రలు వేసి బియ్యం పొందాల్సి ఉంటుంది. గతంలో ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించిన బియ్యం అందజేసిన విషయం తెలిసిందే.  

డీలర్లకు స్థలం కొరత 
జిల్లాలో చాలామంది డీలర్లకు మూడు నెలల బియ్యం కోటా నిల్వ చేసుకునేందుకు సరిపడా స్థలం లేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ తమకు శక్తికి మించి భారమవుతుందని రేషన్‌ డీలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ–పాస్‌ యంత్రాలు సక్రమంగా పని చేయకపోవడం, వినియోగదారులు మూడుసార్లు వేలిముద్రలు పెట్టడంతో పంపిణీ ఆలస్యం అవుతుంది. దీంతో ఒక్కో వినియోగదారుడికి కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని డీలర్లు వాపోతున్నారు.

 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)